Gold Storage Limit at Home : మీ ఇంట్లో ఎంత బంగారం దాచుకోవచ్చునో తెలుసా?
రూ.2000 నోట్లు ఉపసంహరణ ప్రకటన తర్వాత బంగారం కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయని సర్వేలు చెబుతున్నాయి. బంగారం కొంటున్నారు సరే.. పరిమితులు తెలుసుకున్నారా? పరిమితి దాటి కొంటే పన్ను కట్టాలి.. లేదంటే అధికారుల నుంచి ప్రశ్నలు ఎదుర్కోక తప్పదు.

Gold Storage Limit at Home
Gold Storage Limit at Home : బంగారం అంటే అందరికీ మక్కువే. చాలామంది పొదుపు చేసిన డబ్బును బంగారం మీద పెడతారు. అయితే బంగారం కొనుగోలు చేసినా ఎంతవరకూ ఇంట్లో ఉంచుకోవచ్చు. పరిమితికి మించిన బంగారం కొనుగోలు చేస్తే ఎలాంటి పన్ను విధిస్తారు.
New GST Rule : మే 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్.. ట్యాక్స్ పేయర్లకు ఇక దబ్బిడి దిబ్బిడే..!
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నా.. బంగారం కలిగి ఉన్నా దానికి పన్ను కట్టాలి. బంగారు ఆభరణాలు నిల్వకి పరిమితి ఉంది. దానికి పన్ను నియమాలు ఉన్నాయి. అవి తెలియకపోతే అధికారుల తనిఖీలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రూ.2000 నోట్లు చలామణి ఉపసంహరించుకోవాలని ఆర్‌బిఐ ప్రకటించిన తరువాత చాలామంది బంగారం కొనడానికి మక్కువ చూపుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అలా ఎవరైనా బంగారం కొనాలి అనుకుంటే అవి తనిఖీలకు గురి కాకుండా బంగారాన్ని ఇంట్లో భద్రపరుచుకోవచ్చు. అయితే ఇంట్లో దాచుకునే బంగారానికి ఆదాయపు పన్ను ఎలా విధించబడుతుందో తెలుసుకోవాలి.
మీరు కొనుగోలు చేసిన, పెట్టుబడి పెట్టిన బంగారాన్ని ప్రూఫ్‌ల ద్వారా ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు ఇన్వెస్టిగేషన్‌లో వివరించగలితే మీరు ఇంట్లో ఎంత బంగారాన్నై ఉంచుకోవచ్చు. దానికి పరిమితి ఉండదు. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ప్రకారం ఎలాంటి రుజువు చూపకుండా వివాహిత మహిళలు 500 గ్రాములు, అవివాహిత మహిళ 250 గ్రాములు, పురుషులు కేవలం 100 గ్రాములు మాత్రమే ఉంచుకోవడానికి పరిమితులు ఉన్నాయి.
ఇక బంగారం కొనాలి అనుకున్నప్పుడు వాటి ధర హెచ్చు తగ్గులు కూడా చూసుకోవాలి. దాంతో పాటు పన్ను ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. బంగారంపై పన్ను వాటి మోడల్, సేవలపై ఆధారపడి ఉంటుంది. బంగారు కడ్డీలు, నాణాలు, ఆభరణాలపై 3% GST చెల్లించాలి. ఆభరణాలు, వాటి తయారీ సేవలకు సంబంధించిన ఛార్జీల విషయానికి వస్తే GST రేటు 5% వద్ద ఎక్కువ రేటు ఉంటుంది. బంగారం కొనే సమయంలో ప్రత్యక్ష పన్ను ఉండదు. కానీ పాన్ వివరాల ద్వారా బంగారం ఎంత మొత్తంలో కొన్నామనేది అధికారులు తెలుసుకుంటారు. అందువల్ల బంగారాన్ని ఎక్కువ మొత్తంలో కొనాలనుకున్నప్పుడు వాటికి పన్ను చెల్లించాలి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. లేదంటే అధికారుల నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది.