New GST Rule : మే 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్.. ట్యాక్స్ పేయర్లకు ఇక దబ్బిడి దిబ్బిడే..!

New GST Rule : పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. మే 1 నుంచి కొత్త జీఎస్టీ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కోట్లకు పైగా టర్నోవర్ చేసే వ్యాపారాల్లో ఇన్ వాయిస్‌కు సంబంధించి తగినంత సమయం ఇచ్చేందుకు ఈ కొత్త ఫార్మాట్ పాటించాల్సి ఉంటుంది.

New GST Rule : మే 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్.. ట్యాక్స్ పేయర్లకు ఇక దబ్బిడి దిబ్బిడే..!

New GST Rule for these businesses from May 1, 2023

Updated On : April 30, 2023 / 9:44 PM IST

New GST Rule : పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. కొత్త జీఎస్టీ (GST) నిబంధనలు మే 1, 2023 నుంచి అమల్లోకి రానున్నాయి. పన్నుచెల్లింపుదారులు జీఎస్టీ నిబంధనల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే.. రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలకు జీఎస్టీ కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. అంటే.. వ్యాపారాలకు సంబంధించి ఇన్‌వాయిస్ జారీ చేసిన 7 రోజులలోపు ఐఆర్‌పి (IRP)లో తమ ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని GST నెట్‌వర్క్ తెలిపింది. ప్రస్తుతం, వ్యాపారాలు అటువంటి ఇన్‌వాయిస్ జారీ చేసిన తేదీతో సంబంధం లేకుండా ప్రస్తుత తేదీన ఇన్‌వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (IRP)లో ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్ చేస్తుంటాయి.

పన్ను చెల్లింపుదారులకు GST నెట్‌వర్క్ ఒక అడ్వైజరీ కూడా జారీ చేసింది. దీని ప్రకారం.. రూ. 100 కోట్ల కన్నా ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువ మొత్తం వార్షిక టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారుల కోసం e-ఇన్‌వాయిస్ IRP పోర్టల్‌లలో పాత ఇన్‌వాయిస్‌లను రిపోర్టు చేయడానికి కాల పరిమితిని విధించాలని (GSTN) ప్రభుత్వం నిర్ణయించింది. సకాలంలో కట్టుబడి ఉండేలా ఈ కేటగిరీలోని పన్ను చెల్లింపుదారులు రిపోర్టింగ్ తేదీలో 7 రోజుల కన్నా పాత ఇన్‌వాయిస్‌లను నివేదించడానికి అనుమతి ఉండదని GSTN తెలిపింది.

Read Also :  Apple iPhone 13 Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. క్రేజీ డీల్ ఎప్పటినుంచంటే?

డెబిట్/ క్రెడిట్ నోట్ రిపోర్టులపై నో టైమ్ లిమిట్ :
పన్ను చెల్లింపుదారులు తమ అవసరానికి అనుగుణంగా తగిన సమయాన్ని పొందవచ్చు. ఈ కొత్త ఫార్మాట్ మే 1, 2023 నుంచి అమల్లోకి రానుంది. ఈ పరిమితి ఇన్‌వాయిస్‌కు వర్తిస్తుంది. డెబిట్/క్రెడిట్ నోట్‌లను రిపోర్టులపై మాత్రం ఎలాంటి టైమ్ లిమిట్ ఉండదని పేర్కొంది. ఉదాహరణకు.. ఇన్‌వాయిస్‌కు ఏప్రిల్ 1, 2023 తేదీ ఉంటే.. ఏప్రిల్ 8, 2023 తర్వాత నివేదించలేమని GSTN తెలిపింది.

ఇన్‌వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో వెరిఫికేషన్ సిస్టమ్.. 7-రోజుల విండో తర్వాత ఇన్‌వాయిస్‌ను నివేదించడానికి ట్యాక్స్ పేయర్లను అనుమతించదు. అందువల్ల.. పన్ను చెల్లింపుదారులు కొత్త సమయ పరిమితి ద్వారా అందించిన 7-రోజుల విండోలో ఇన్‌వాయిస్‌ను నివేదించినట్టు నిర్ధారించుకోవాల్సి ఉంటుందని GSTN తెలిపింది. GST చట్టం ప్రకారం.. IRPలో ఇన్‌వాయిస్‌లు అప్‌లోడ్ చేయకపోతే సంబంధిత వ్యాపారాలు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC)ని పొందలేవని సూచించింది.

New GST Rule for these businesses from May 1, 2023

New GST Rule for these businesses from May 1, 2023

ఆయా కంపెనీలకు ఇ-ఇన్ వాయిస్ తప్పనిసరి : 
ఏఎంఆర్‌జీ (AMRG) & అసోసియేట్స్ సీనియర్ పార్టనర్ రజత్ మోహన్ మాట్లాడుతూ.. ఈ సాంకేతిక మార్పు పెద్ద కంపెనీలు ఇ-ఇన్‌వాయిస్‌ల బ్యాక్‌డేటింగ్‌ను నిరోధించగలదని అన్నారు. ముందుగా పెద్ద పన్ను చెల్లింపుదారులకు ఈ కొత్త మార్పులను అమల్లోకి తీసుకురానుంది. ఇందులో విజయవంతమైన తర్వాత ప్రభుత్వం ఈ మార్పులను పన్ను చెల్లింపుదారులందరికీ దశలవారీగా అమలు చేయాలని భావిస్తోందని మోహన్ తెలిపారు.

ప్రస్తుతం, రూ. 10 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలు అన్ని B2B లావాదేవీలకు ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌ను రూపొందించాల్సి ఉంటుంది. వస్తువులు, సేవల పన్ను (GST) చట్టం ప్రకారం.. అక్టోబర్ 1, 2020 నుంచి రూ. 500 కోట్ల కన్నా ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలకు బిజినెస్-టు-బిజినెస్ (B2B) లావాదేవీలకు ఇ-ఇన్‌వాయిస్ తప్పనిసరి. ఆ తర్వాత టర్నోవర్ ఉన్న వారికి కూడా పొడిగించడం జరుగుతుంది.

జనవరి 1, 2021 నుంచి రూ. 100 కోట్లకు పైగా.. ఏప్రిల్ 1, 2021 నుంచి రూ. 50 కోట్ల కన్నా ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు B2B ఇ-ఇన్‌వాయిస్‌లను జనరేట్ చేస్తున్నాయి. ఏప్రిల్ 1, 2022 నుంచి దీని థ్రెషోల్డ్ రూ. 20 కోట్లకు తగ్గించింది. అక్టోబర్ 1, 2022 నుంచి థ్రెషోల్డ్ రూ.10కోట్లకు తగ్గింది.

IRPపై ఇన్‌వాయిస్‌లను రిపోర్టు చేయడానికి టైమ్‌లైన్‌ల అమలు సమ్మతిని నిర్వహించడంలో సాయపడుతుందని ట్యాక్స్ పార్టనర్ సౌరభ్ అగర్వాల్ అన్నారు. రూ. 100 కోట్ల టర్నోవర్ పరిమితిని గణనీయంగా తగ్గించిన తర్వాత లేదా IRN (ఇన్‌వాయిస్ రిజిస్ట్రేషన్ నంబర్)ని రూపొందించడానికి అవసరమైన అన్ని మదింపులకు తప్పనిసరి చేసిన తర్వాత GST సేకరణను పెంచడంలో సాయపడుతుందని అగర్వాల్ పేర్కొన్నారు.

Read Also : Mobile Calling New Rule : మొబైల్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. మే 1 నుంచి ట్రాయ్ కొత్త రూల్స్.. ఇకపై ఫేక్ ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు చెక్ పడినట్టే..!