Zoomకు పోటీగా : జీమెయిల్‌లో Google Meet వీడియో కాలింగ్ 

  • Published By: srihari ,Published On : May 7, 2020 / 04:11 AM IST
Zoomకు పోటీగా : జీమెయిల్‌లో Google Meet వీడియో కాలింగ్ 

Updated On : May 7, 2020 / 4:11 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తితో ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ విధించాయి. ప్రజలంతా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు అందరూ వీడియో ప్లాట్ ఫాంలపైనే ఆధారపడుతున్నారు. ఉద్యోగుల నుంచి కుటుంబ సభ్యుల వరకు అందరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కమ్యూనికేట్ అవుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రతిఒక్కరూ వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్ ఫాం Zoom యాప్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు జూమ్ కు పోటీగా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా వీడియో కాన్ఫరెన్స్ యాప్‌ Google Meetను తమ జీమెయిల్ సర్వీసులో నేరుగా ఇంటిగ్రేట్ చేసింది. 

ఇప్పటినుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ను జీమెయిల్ నుంచే యాక్సస్ చేసుకోవచ్చు. కొంతమంది ఇప్పటికే లెఫ్ట్ సైడ్‌బార్‌లోని Gmail ఇంటర్‌ఫేస్‌లో మీట్‌ను ప్రారంభించగల లింక్‌ని చూడవచ్చు. ఇతర యూజర్లు త్వరలో అందుబాటులోకి రానుంది. కొన్ని సంస్థల ఉద్యోగులకు లేదా కొంతమంది విద్యార్థి యూజర్లకు G Suite ద్వారా అందుబాటులో ఉంది. సంస్థ ప్రకటించిన ప్రకారం.. గూగుల్ అకౌంట్ ఉన్న ఎవరికైనా Meet యాప్‌ను ఉచితంగా అందిస్తోంది గూగుల్. 100 మంది వరకు సమావేశాలు నిర్వహించడానికి, టైమ్ లిమిట్ లేని వ్యక్తులను అనుమతిస్తుంది.

జూమ్ కోసం సబ్ స్ర్కైబర్లు పెరిగిన తరువాత.. జూమ్‌కు పోటీగా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ మీట్‌ను పునరుద్ధరించింది. మెజారిటీ ప్రాంతాల్లో, కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు దాదాపు రెండు నెలలుగా ఇంటి నుండి పని చేస్తున్నారు. గూగుల్ మీట్‌లో Zoom యాప్‌లో లేని కొన్ని ప్రైవసీ కంట్రోల్స్ ఉంటాయని భావిస్తున్నారు. సమావేశంలో చేరడానికి Zoom కేవలం డయల్-ఇన్ ఫంక్షన్ కలిగి ఉంది. మీట్ మాత్రం భిన్నంగా పనిచేస్తుంది.

మీట్‌ యాప్‌తో.. ఏ యూజర్ అయినా మొదట గూగుల్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. మీటింగ్ హోస్ట్ ద్వారా లింక్ పంపకపోతే, యూజరు సమావేశంలో జాయిన్ కావాలంటే వెయిటింగ్ ఏరియాకు పంపతుంది. మైక్రోసాఫ్ట్ తన వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీసును Skypeతో రన్ చేస్తోంది. తన Teams యాప్‌ను రోజువారీ 75 మిలియన్ యాక్టివ్ యూజర్లకు పెంచినట్టు మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు, మీట్ రోజుకు 3 మిలియన్ల మంది కొత్త యూజర్లను చేర్చుతోంది. గూగుల్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ చాట్ యాప్, మొబైల్ వీడియో చాట్ యాప్, డుయోతో పాటు హ్యాంగ్అవుట్స్ చాట్, మీట్, హ్యాంగ్అవుట్‌ సర్వీసులను అందిస్తోంది. 

Also Read | కరోనా భయంతో ఆన్‌లైన్‌లో పెళ్లిళ్లు.. న్యూయార్క్‌లో Zoom ద్వారా చట్టపరంగా పెళ్లి చేసుకోవచ్చు!