Viral Video: వావ్..ఈ ప్రభుత్వ ఉద్యోగి ముందు మెషిన్ కూడా బలాదూరే..ఏమా స్పీడు?!

ఈ ప్రభుత్వ ఉద్యోగి ముందు మెషిన్ కూడా బలాదూరే..అనేంత వేగంగా పనిచేస్తున్నాడు. ఇతని వేగం చూస్తే ఏమా స్పీడు..అని అనిపిస్తోంది.

Viral Video: వావ్..ఈ ప్రభుత్వ ఉద్యోగి ముందు మెషిన్ కూడా బలాదూరే..ఏమా స్పీడు?!

Govt Employee Stamped The Documents Like A Machine

Updated On : December 28, 2021 / 3:53 PM IST

govt employee stamped the documents like a machine :  ప్రభుత్వ ఉద్యోగులంటే సరిగా పనిచేయరని..ఒక్క ఫైల్ కదలాలంటే కాళ్లు అరిగేలా తిరగాలని.అలాగే లంచం ఇవ్వందే ఏ పని చేయరనీ..పని మానేసి నిద్రపోతుంటారని ఇలా ఎన్నో ఆరోపణలున్నాయి. కానీ ప్రభుత్వ ఆఫీసులో పనిచేసే ఓ ఉద్యోగి చేసే పనిచూస్తే మాత్రం వావ్ అనాల్సిందే. ఆ ఉద్యోగి పని చేసి వేగం చూస్తే ఇతను మనిషేనా? లేకా మిషనా? అనేఅనుమానం వస్తుంది. మెషిన్ కంటే వేగంగా టకటకా పని చేస్తున్నాడు.

ఒక వ్యక్తి కొన్ని పేపర్స్ పై ఆగకుండా స్టాంప్ చేస్తున్నాడు. ఒక చేత్తో పేజీలు తిప్పుతూ మరో చేత్తో స్టాంప్ వేస్తున్న ఈ సహచరుడి స్పీడ్ చూసి మీరు కూడా మెషీన్ కంటే ఎక్కువ వేగంతో ఉన్నారని మీరు అనుకుంటారు. క్షణాల వ్యవధిలో వందల పేజీలకు స్టాంప్ వేసేశాడు.

వైరల్ అవుతున్న ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనితో అతను ‘ప్రైవేటీకరణ వార్తలను విన్నప్పుడు ప్రభుత్వ పని సామర్థ్యంలో అపూర్వమైన పెరుగుదల’ అనే క్యాప్షన్ రాశారు.