హ్యాపీ బర్త్‌డే బాస్ లేడీ.. నమ్రతకు మహేష్ విషెస్..

Happy Birthday Namrata: ఫ్యామిలీ.. షూటింగ్.. ఈ రెండే సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రపంచం.. షూటింగ్‌కి గ్యాప్ దొరికితేనో లేక తాను గ్యాప్ తీసుకునో ఏడాదికి కనీసం ఒకటి, రెండు సార్లైనా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కోసం విదేశాలకు వెళ్తుంటారు. ఈ సారి దుబాయ్ ట్రిప్ వేశారు.
జనవరి 22 న మహేష్ శ్రీమతి నమ్రత పుట్టినరోజు.. ఈ ఏడాదితో 49 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారామె. దుబాయ్‌లో నమ్రత బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా మహేష్ తన సతీమణికి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
‘‘ప్రతి రోజు నీతో గడపడం నాకు ప్రత్యేకం. కానీ ఈ రోజు మరింత ప్రత్యేకం. అద్భుతమైన స్త్రీతో అందమైన రోజు.. ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు బాస్ లేడీ..’’ అంటూ నమ్రతతో కలిసి ఉన్న క్యూట్ పిక్ షేర్ చేశారు సూపర్‌స్టార్.. మహేష్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్‌లో జరుగనుంది.
Someone I love was born today! ❤️ Everyday with you is special but today is a little more!! Celebrating my amazing woman. Happy birthday, boss lady ♥️♥️ pic.twitter.com/gDQ3hHVvSt
— Mahesh Babu (@urstrulyMahesh) January 21, 2021