CM Jagan House : సీఎం జగన్ నివాసం దగ్గర హై అలర్ట్.. భారీ బందోబస్తు

అమరావతి రైతుల దీక్షలకు రేపటితో(జూన్ 19,2021) 550 రోజులు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో నిరసనకారులు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తారన్న సమాచారంతో

CM Jagan House : సీఎం జగన్ నివాసం దగ్గర హై అలర్ట్.. భారీ బందోబస్తు

High Alert At Cm Jagan House

Updated On : June 18, 2021 / 10:34 PM IST

CM Jagan House : అమరావతి రైతుల దీక్షలకు రేపటితో(జూన్ 19,2021) 550 రోజులు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో నిరసనకారులు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైతుల నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి నిరాకరించారు. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం దగ్గర పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

సీఎం నివాసం పరిధిలో ఎవరైనా కొత్తవారికి ఆశ్రయం కల్పిస్తే చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయానికి దారితీసే మార్గాల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఏపీకి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి అమరావతి రైతులు ధర్నాలు
చేపడుతున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలోనూ రైతుల దీక్షలు కొనసాగాయి.