Balayya : హిందూపూర్ కోవిడ్ బాధితుల కోసం 20 లక్షల రూపాయల విలువైన మందులు పంపిన బాలయ్య..
నటసింహ, హిందూపూర్ ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నియోజకవర్గంలోని కోవిడ్ బాధితుల కోసం 20 లక్షల రూపాయల విలువైన కోవిడ్ మందులను హైదరాబాద్ నుంచి పంపించారు..

Hindupur Mla Nandamuri Balakrishna Sent Covid Medicines Worth Rs 20 Lakhs From Hyderabad
Balayya: నటసింహ, హిందూపూర్ ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నియోజకవర్గంలోని కోవిడ్ బాధితుల కోసం 20 లక్షల రూపాయల విలువైన కోవిడ్ మందులను హైదరాబాద్ నుంచి పంపించారు..
స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కోవిడ్ కిట్స్‌ను బాలకృష్ణ నివాసం వద్ద కోవెడ్ బాధితుల బంధువులకు అందజేశారు. ఇప్పటికే తమ నియోజకవర్గంలో తాగునీటితో సహా ఎన్నో సమస్యలు తీర్చడంతోపాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమేకాక.. గతేడాది కరోనా టైం లోనూ, ఇప్పుడీ సెకండ్ వేవ్ కష్టకాలంలోనూ అవసరమైన మందులను తన సొంత ఖర్చులతో పంపిన బాలయ్యకు, బాధితులు కృతజ్ఞతలు తెలిపారు..
సినిమాల విషయానికొస్తే.. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ చిత్రం చేస్తున్నారు బాలయ్య. ఉగాది కానుకగా ‘టైటిల్ రోర్’ పేరుతో టీజర్ రిలీజ్ చెయ్యగా తక్కువ సమయంలోనే 50+ మిలయన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది..
అనంతపురం:
హిందూపురం కోవిడ్ బాధితుల కోసం 20 లక్షల రూపాయల విలువైన కోవిడ్ మందులను హైదరాబాద్ నుంచి పంపించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. pic.twitter.com/PYi4qs1shR— BARaju (@baraju_SuperHit) May 13, 2021