ఫేస్‌బుక్ ‘అవతార్’ ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? 

  • Published By: srihari ,Published On : May 26, 2020 / 06:20 AM IST
ఫేస్‌బుక్ ‘అవతార్’ ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? 

Updated On : May 26, 2020 / 6:20 AM IST

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ 2018లో తమ యాప్‌లో కొత్త అవతార్ ఫీచర్ ప్రవేశపెట్టింది. దాన్నే Facebook Avatar అని పిలుస్తారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, కెనడా దేశాల్లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. భారతదేశం సహా ఇతర దేశాల్లో ఈ కొత్త అవతార్ ఎప్పుడు రిలీజ్ చేస్తుందో ఫేస్ బుక్ ఇంకా రివీల్ చేయలేదు. ప్రముఖ ఇతర సోషల్ యాప్ స్నాప్ చాట్ బిట్ మోజీ, ఆపిల్ మెమెజీ అవతార్ మాదిరిగానే ఫేస్ బుక్ కూడా కార్టినీస్ క్యారెక్టర్లను యాప్ యూజర్లు క్రియేట్ చేసుకునేలా ఫీచర్ రూపొందించింది. 

ఫేస్ బుక్ అవతార్ క్రియేట్ చేసిన తర్వాత యూజర్లు తమ కామెంట్లు, స్టోరీలు, ప్రొఫైల్ పిక్స్, మెసేంజర్ చాట్ విండోలలో వినియోగించుకోవచ్చు. థర్డ్ పార్టీ యాప్స్ లో స్నాప్ చాట్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ల్లోనూ క్రియేట్ చేసిన ఫేస్‌బుక్ అవతార్ ఎక్స్ పోర్టు చేసుకోవచ్చు. మీ సొంతంగా ఫేస్ బుక్ అవతార్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఓసారి చూద్దాం..  ఈ కింది విధంగా ఫాలో అయితే చాలు… 

* మీ ఫోన్లో ఫేస్‌బుక్ యాప్ ఓపెన్ చేయండి. 
* ఆండ్రాయిడ్ యాప్‌లో టాప్ రైట్ కార్నర్‌లో hamburger మెనుపై tap చేయండి.
* iOS యాప్ లో అయితే బాటమ్ రైట్ కార్నర్‌లోని hamburger మెనుపై Tap చేయండి.
* See More ఆప్షన్ పై Tap చేయండి.
* ‘Avatars’ ఆప్షన్‌పై Tap చేసి Get Startedపై నొక్కండి. 
* మీ హెయిర్ స్టయిల్, ఫేస్ షేప్, ఫేస్ లైన్స్ ఎంపిక చేసుకుని మీ క్యారెక్టర్ కస్టమైజ్ చేసుకోవచ్చు.
* యాప్‌లో అనేక కస్టమైజేషన్ అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన క్యారెక్టర్ వాడుకోవచ్చు.
* యానిమేటెడ్ క్యారెక్టర్ బదులుగా ఫేస్ మాత్రమే కాదు.. బాడీ షేప్ అవతార్ కూడా ఎంపిక చేసుకోవచ్చు. 
* మీకు నచ్చిన క్యారెక్టర్ సెట్ చేశాక టాప్ రైట్ కార్నర్‌లో ‘tick’ ఐకాన్ పై ట్యాప్ చేయండి. 
* Next ఎంపిక చేశాక Done ఆప్షన్ పై క్లిక్ చేస్తే చాలు.. 

ఫేస్ బుక్ అవతార్ క్రియేట్ చేశాక.. స్మైలీ ఫేస్ ఐకాన్‌పై tap చేయండి. కామెంట్ సెక్షన్లో కూడా అవతార్ వినియోగించుకోవచ్చు. 

Read: ఫేస్‌బుక్ యూజర్ల సెక్యురిటీ కోసం కొత్త ఫీచర్‌