Antioxidants : పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి చేసే మేలెంత?
పండ్లలో విటమిన్ సి, యాంథోసయనిన్స్, ఫెనోలిక్ ఫ్లావనాయిడ్లు శరీరంలోని కణాలను, కణజాలాన్నీ , అవయవాలను ఉత్తేజపరుస్తాయి.

Fruits
Antioxidants : మనిషి శరీరంలో నిరంతరం జీవక్రియలు జరుగుతుంటాయి. ఈ జీవక్రియల సందర్భంలో శరీరంలో ఫ్రీరాడికల్స్ కణాలు పుడుతుంటాయి. ఇవి శరీరంలోని అన్ని ప్రాంతాల్లో సంచరిస్తూ కణజాలాన్నీ దెబ్బతీస్తుంటాయి. బాడీలో వీటి స్ధాయి పెరిగే కొద్దీ వ్యాధులు కూడా అధికమయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా క్యాన్సర్ల వంటి జబ్బులు పుట్టుకొస్తాయి. అంతేకాకుండా చిన్నవయస్సులోనే పెద్ద వయస్సు వారిలా కనిపిస్తారు.
ముఖ్యంగా ఈ ఫ్రీరాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడుకునేందుకు మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనే కణాలు ఎంతో అవసరం. శరీరంలో ఈ యాంటీ ఆక్సిడెంట్లను అధికంగా పెంచుకునేందు ప్రయత్నిస్తే ఇవి ఫ్రీరాడికల్స్ ను నిర్మూలించటంలో ప్రయత్నిస్తాయి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారాల ద్వారా యాంటీ ఆక్సిడెంట్లను పెంచుకోవచ్చు. అయితే పండ్ల ను తీసుకోవటం ద్వారా యాంటీ ఆక్సిడెంట్లను అధికంగా పొందవచ్చు.
పండ్లలో విటమిన్ సి, యాంథోసయనిన్స్, ఫెనోలిక్ ఫ్లావనాయిడ్లు శరీరంలోని కణాలను, కణజాలాన్నీ , అవయవాలను ఉత్తేజపరుస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్ల స్ధాయి పండ్లలో అధికంగా ఉంటుంది. పండ్లను ఆహారంలో ఎక్కవ మోతాదులో చేర్చటం వల్ల అనేక శరీర రుగ్మతల నుండి విముక్తి పొందవచ్చు. పండ్లలో లభించే పీచు వల్ల మలబద్దకాన్ని నివారించవచ్చు. జీవక్రియలను పెంచుకోవచ్చు.
అధిక రక్తపోటు వంటి సమస్యలను నివారించుకోవచ్చు. పండ్లలో సోడియం తక్కువగా ఉండటం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. వీటిల్లో ఉండే విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లాలు బాగా ఉపకరిస్తాయి. క్యాలరీల తగ్గించి, ఊబకాయం వంటి సమస్యలు దరిచేరకుండా చూస్తాయి. గుండె జబ్బులు, పక్ష వాతం వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అందుకే పండ్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవటం సర్వత్రా ఆరోగ్యానికి శ్రేయస్కరం.