Allu Arjun Family : ఆకాశంలో అద్భుతాన్ని పిల్లలకు చూపించిన అల్లు అర్జున్..
అర్హ, అయాన్‌లతో మంచం మీద పడుకుని ఈ సుందర దృశ్యాన్ని పిల్లలకు చూపిస్తూ సందడి చేశారు బన్నీ..

Icon Star Allu Arjun Enjoying With His Kids
Allu Arjun Family: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పర్సనల్ అండ్ ప్రొషనల్ లైఫ్‌ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంటారు. షూటింగ్స్ నుండి కాస్త గ్యాప్ దొరికితే చాలు అర్హ, అయాన్‌లతో కలిసి సందడి చేస్తుంటారు. తన ముద్దుల పిల్లల క్యూట్ క్యూట్ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు బన్నీ వైఫ్ స్నేహా రెడ్డి.
రీసెంట్‌గా ఆమె పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. బుధవారం (జూన్ 2) ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. సూర్యుడి చుట్టూ ఇంద్ర ధనస్సు కాంతి వలయంగా ఏర్పడింది. ఈ అపురూప దృశ్యం అందర్నీ ఆకట్టుకుంది.
అర్హ, అయాన్‌లతో మంచం మీద పడుకుని ఈ సుందర దృశ్యాన్ని పిల్లలకు చూపిస్తూ సందడి చేశారు బన్నీ.. ఈ వీడియోకు బాలీవుడ్ మూవీ Aisha లోని Sham సాంగ్‌ను బ్యాగ్రౌండ్‌లో యాడ్ చేయడంతో మంచి ఫీల్ వచ్చింది. స్నేహా రెడ్డి షేర్ చేసిన ఈ వీడియో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది..
View this post on Instagram