Varshini case: మరో లేడీ విలన్.. మొదట భర్తను.. ఆ తర్వాత 22 ఏళ్ల కూతురిని ప్రియుడితో కలిసి చంపేసి..
కూతురు కనపడట్లేదని ఆగస్టు 6వ తేదీన చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కూతురు డెడ్ బాడీని ఊరి చివర గుట్టల్లో పడేశారు కవిత, ఆమె ప్రియుడు రాజ్ కుమార్.

Varshini case
Varshini case: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యువతి వర్షిణి మృతిపై మిస్టరీ వీడింది. భర్తను హత్య చేసిన విషయం బయటపడుతుందని కూతురు వర్షిణిని హత్య చేసింది ఆమె తల్లి కవిత.
ప్రియుడు రాజ్ కుమార్‌తో కలిసి జూన్ 25న భర్త కుమారస్వామిని కవిత హత్య చేసింది. అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు నిర్వహించింది.
Also Read: భూమిపై ఏలియన్ స్పేస్‌క్రాఫ్ట్ భీకర దాడి చేస్తుందా? సమయం ముంచుకొస్తుందా? అధ్యయనంలో సంచలన విషయాలు
కూతురుకు విషయం తెలియడంతో ప్రియుడితో కలిసి ఈనెల 3న కుమార్తెను కూడా చంపేసింది. కూతురు శవాన్ని ఫ్రిజ్ లో దాచిపెట్టి, ఆమె కనిపించకుండా పోయిందని ప్రచారం చేసింది.
కూతురు కనపడట్లేదని ఆగస్టు 6వ తేదీన చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కూతురు డెడ్ బాడీని ఊరి చివర గుట్టల్లో పడేశారు కవిత, ఆమె ప్రియుడు రాజ్ కుమార్.
ఎవరూ గుర్తించకపోవడంతో తిరిగి డెడ్ బాడీని కాటారం శివారు అడవిలో పడేసి క్షుద్ర పూజల సీన్ క్రియేట్ చేశారు. వర్షిణి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో చేస్తూ డబుల్ మర్డర్ ను ఛేదించారు పోలీసులు. కప్పల కవిత, ఆమె ప్రియుడు రాజ్ కుమార్ పై హత్యకేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.