గతంలో ఎవరినీ ఎదగనీయలేదు.. ఇప్పుడు వాళ్లే ఇలా.. ఇందుకే బీఆర్‌ఎస్‌లో కొట్లాటలు: కవిత కామెంట్స్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి కౌంటర్‌

హరీశ్ రావు, సంతోష్ రావు వెనుక తానెందుకుంటానని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు పరస్పరం యాసిడ్ దాడులు చేసుకుంటున్నారని చురకలు అంటించారు. (CM Revanth Reddy)

గతంలో ఎవరినీ ఎదగనీయలేదు.. ఇప్పుడు వాళ్లే ఇలా.. ఇందుకే బీఆర్‌ఎస్‌లో కొట్లాటలు: కవిత కామెంట్స్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి కౌంటర్‌

Updated On : September 3, 2025 / 3:41 PM IST

CM Revanth Reddy: బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికే బండకేసి కొట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్‌ నుంచి కవితను సస్పెండ్‌ చేయడం, ఆమె తనపై చేసిన కామెంట్స్‌పై రేవంత్‌ రెడ్డి ఇవాళ పాలమూరు జిల్లాలో మాట్లాడారు.

గతంలో ఎవరినీ ఎదగనీయని బీఆర్ఎస్‌ నేతలు ఇప్పుడు వారిలో వారే కొట్లాటలు పెట్టుకుంటున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇన్నాళ్లూ బీఆర్ఎస్‌ పెద్దలు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకున్నారని ఆయన చెప్పారు.

బీఆర్‌ఎస్‌ ఉనికిలో లేకుండా పోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. అవినీతి సొమ్ము పంపకంలో బీఆర్ఎస్‌లో తేడాలు వచ్చాయని, అందుకే ఇలా కొట్టుకుంటున్నారని ఆరోపించారు. వారి కొట్లాటలోకి తననెందుకు లాగుతున్నారని నిలదీశారు.

హరీశ్ రావు, సంతోష్ రావు వెనుక తానెందుకుంటానని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు పరస్పరం యాసిడ్ దాడులు చేసుకుంటున్నారని చురకలు అంటించారు. (CM Revanth Reddy)