Bandi Sanjay : కవిత ఇష్యూపై బండి సంజయ్ సంచలన కామెంట్స్.. వాళ్లంతా కలిసి ఆడుతున్న డ్రామా..
బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్.. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా అంశాలపై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కీలక కామెంట్స్ చేశారు.

Bandi Sanjay
Bandi Sanjay : బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్.. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా అంశాలపై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కీలక కామెంట్స్ చేశారు. కవిత రాజీనామాచేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. కాళేశ్వరం ఇష్యూను డైవర్ట్ చేయడానికి వాళ్లంతా కలిసి ఈ డ్రామా ఆడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు.
కవిత రాజీనామాతో తెలంగాణ ప్రజలకు ఏమి ఒరిగేది లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా ఇది. ప్రజలు వాళ్ల డ్రామాలను పూర్తిగా అర్ధం చేసుకుంటున్నారు. తెలంగాణలో ఎన్నికలు జరిగితే అధికారంలోకి వచ్చేది బీజేపీనే. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. ఆ పార్టీకి కాంగ్రెస్ వత్తాసు పలుకుతుందని బండి సంజయ్ అన్నారు.
లోకల్‌బాడీ ఎన్నికల్లో పార్టీ క్యాడర్‌ను గెలిపించే బాధ్యత నాది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి కోసం నేనే నిధులు ఇస్తా. ఎంపీటీసీ గెలిపిస్తే రూ.5 లక్షలు, జడ్పీటీసీగా గెలిపిస్తే రూ. 10లక్షలు ఇస్తానని బండి సంజయ్ అన్నారు. కేంద్రం నిధులకోసం రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలు పెడుతుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు.
అసెంబ్లీలో వరదలు, రైతు సమస్యలు, పింఛన్, ఉద్యోగాలు, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై చర్చ లేదు. కాళేశ్వరంపై చర్చపెట్టి ఒకరినొకరు తిట్టుకున్నారు. కేసీఆర్ సొంత బిడ్డే చెప్తుంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆమె చెప్తుంది. కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది నేనే. అయితే, రెండేళ్లుగా సీబీఐ విచారణకు ఎందుకు ఇవ్వలేదో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దేశంలో అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం కుంభకోణం. కోర్టులో వాదనలు వినిపించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని సంజయ్ అన్నారు.
అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎందుకు సీబీఐకి అప్పగించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. డైలీ సీరియల్ లెక్క విచారణ చేస్తున్నారు. ఫార్ములా కేసు ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదు..? విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.