OG Trailer : ప‌వ‌న్ ‘ఓజీ’ ట్రైల‌ర్ వ‌చ్చేది అప్పుడేనా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) న‌టిస్తున్న మూవీ ఓజీ. ఈ చిత్ర‌ ట్రైలర్‌ (OG Trailer) రిలీజ్‌ డేట్‌ లాక్‌ చేసే..

OG Trailer : ప‌వ‌న్ ‘ఓజీ’ ట్రైల‌ర్ వ‌చ్చేది అప్పుడేనా?

Is Pawan Kalyan OG Trailer date locked

Updated On : September 3, 2025 / 4:57 PM IST

OG Trailer : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) న‌టిస్తున్న మూవీ ఓజీ. సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. సెప్టెంబ‌ర్ 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

సోషల్‌ మీడియాలో అయితే ఓజీ మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్‌స్టా, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ప్లాట్‌ఫామ్‌ ఏదైనా.. నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో దే కాల్‌ హిం ఓజీ హ్యాషట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. ఇక ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా హ్యాపీ బర్త్‌ డే ఓజీ.. లవ్‌ ఓమీ పేరుతో రిలీజ్‌ అయిన స్పెషల్‌ గ్లింప్స్‌.. ఓజీ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది.

SSMB29 : ఆ విషయంలో అవతార్, ఎవెంజర్స్ ని మించి.. హాలీవుడ్ టార్గెట్ గా మహేష్ రాజమౌళి సినిమా..

పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కి ప్రామిస్‌ చేసినట్లే.. డైరెక్టర్‌ సుజీత్‌ ఓజీని నెక్స్ట్‌ లెవెల్‌లో ప్రమోట్‌ చేస్తున్నారు. ఓజీ నుంచి వచ్చే అప్‌డేట్‌ ఏదైనా.. దాని రిజల్ట్‌ మాత్రం బ్లాస్ట్‌ అయ్యే రేంజ్‌లో ఉంటుందని చెప్తూ వచ్చారు సుజీత్‌. చెప్పడమే కాదు.. ఒక్కో అప్‌డేట్‌తో సినిమాపై హైప్‌ని నెక్స్ట్‌ లెవెల్‌కి తీసుకెళ్తున్నారు.

ఫ్యాన్‌బాయ్‌ సుజీత్‌ టేకింగ్‌కి బిగ్‌ ఎసెట్‌గా నిలిచారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌. తన పవర్‌ఫుల్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో ఓజీ ప్రమోషనల్ కంటెంట్‌ని నెక్స్ట్‌ లెవెల్‌కి తీసుకెళ్తున్నారు తమన్. ఇప్పటికే ఓజీ నుంచి విడుదలైన ఫైర్‌స్టార్మ్‌, సువ్వి సువ్వి సాంగ్స్‌.. చార్ట్‌ బాస్టర్‌గా అదరగొడుతున్నాయి.

SISU: Road To Revenge : ‘శిశు : రోడ్ టు రివెంజ్’ ఇండియాలో కూడా రిలీజ్.. తెలుగు ట్రైలర్..

పవన్‌ అభిమానులతో పాటు ఆడియెన్స్‌ అంతా ఓజీ ట్రైలర్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ప్రజెంట్‌ పవన్‌ కల్యాణ్‌ ఓజీ సినిమా డబ్బింగ్‌ని పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. వన్స్‌ పవన్‌ కల్యాణ్‌ డబ్బింగ్‌ కంప్లీట్‌ కాగానే.. ఓజీ ట్రైలర్‌ (OG Trailer) రిలీజ్‌ డేట్‌ లాక్‌ చేసే ఆలోచనలో ఉన్నారట సుజీత్‌. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ నెల 17న ఓజీ ట్రైలర్‌ వచ్చే చాన్స్‌ ఉంది. ఎన్నో అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందో వేచి చూడాల్సిందే.