SSMB29 : ఆ విషయంలో అవతార్, ఎవెంజర్స్ ని మించి.. హాలీవుడ్ టార్గెట్ గా మహేష్ రాజమౌళి సినిమా..

ఇప్పటి వరకు ఈ రెండు సినిమాలే అత్యధిక దేశాల్లో రిలీజయ్యాయి. మన పుష్ప 2 సినిమా 86 దేశాల్లో రిలీజ్ అయింది.(SSMB29)

SSMB29 : ఆ విషయంలో అవతార్, ఎవెంజర్స్ ని మించి.. హాలీవుడ్ టార్గెట్ గా మహేష్ రాజమౌళి సినిమా..

SSMB29

Updated On : September 3, 2025 / 2:22 PM IST

SSMB29 : రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు SSMB29 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకోగా ప్రస్తుతం మూడో షెడ్యూల్ షూటింగ్ ఆఫ్రికాలోని కెన్యా దేశంలో జరుపుకుంటుంది.(SSMB29)

రాజమౌళి, మూవీ టీమ్ కెన్యా ఫారిన్ మినిస్టర్ ముసాలియా ముదావాదిని కలిశారు. ఈ క్రమంలో ముసాలియా ముదావాది తన సోషల్ మీడియాలో మహేష్ సినిమా గురించి, రాజమౌళి సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. కెన్యా అడవుల్లో, గొప్ప ప్రదేశాల్లో షూటింగ్ చేస్తున్నారని తెలిపారు. అలాగే ఈ సినిమా 120 దేశాల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని, 100 కోట్ల మందికి ఈ సినిమా రీచ్ అవుతుందని అన్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగ్గా ఈ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారని మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : SISU: Road To Revenge : ‘శిశు : రోడ్ టు రివెంజ్’ ఇండియాలో కూడా రిలీజ్.. తెలుగు ట్రైలర్..

అయితే గతంలో అవతార్ సినిమా దాదాపు 100 దేశంలో రిలీజ్ చేసారు. ఎవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా 106 దేశాల్లో రిలీజయింది. ఇప్పటి వరకు ఈ రెండు సినిమాలే అత్యధిక దేశాల్లో రిలీజయ్యాయి. మన పుష్ప 2 సినిమా 86 దేశాల్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ హాలీవుడ్ సినిమాలను బీట్ చేసి మరీ మహేష్ రాజమౌళి సినిమా ఇంకా ఎక్కువ దేశాల్లో రిలీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ 120 దేశాల్లో, అన్ని ఖండాల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు రాజమౌళి.

ఇప్పటికే అన్ని దేశాల్లో ఉన్న తెలుగు వారితో, ఇండియన్ కమ్యూనిటీలతో మాట్లాడి సినిమా ఆ దేశాల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే కెన్యాలో ఉన్న ఇండియా ప్రతినిధుల ద్వారానే కెన్యా ఫారిన్ మినిస్టర్ ని కలిశారట. అక్కడ షూటింగ్ చేసినందుకు ప్రభుత్వ ప్రోత్సాహాం ఉంటుందని సమాచారం.

Also Read : Kishkindhapuri : ‘కిష్కింధపురి’ ట్రైలర్ వచ్చేసింది.. బెల్లంకొండ, అనుపమ హారర్ థ్రిల్లర్ అదిరిందిగా..

అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ, దుబాయ్, జపాన్, చైనా, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఇలా చాలా దేశాల్లో ఇప్పటికే మన ఇండియన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ మహేష్ రాజమౌళి సినిమాతో ప్రపంచం అంతా మన టాలీవుడ్ పేరు మారుమ్రోగేలా చేయబోతున్నారు.