Kavitha : నేను కేసీఆర్‌కు రాసిన లేఖను లీక్ చేసింది అతనే.. కేసీఆర్ ఫొటోతోనే నా కార్యక్రమాలు.. మీడియా చిట్‌చాట్‌లో కవిత
మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయని, కేటీఆర్‌కు సంబంధించిన వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని కవిత (Kavitha) అన్నారు.

Kavitha
Kavitha : బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తరువాత తొలిసారి బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, సంతోష్‌రావులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్స్ ను సృష్టించేది హరీశ్ రావే.. హరీశ్ రావు, సంతోష్‌లను పక్కన పెడితేనే పార్టీ బతుకుతుందని కవిత అన్నారు.
Also Read: Bandi Sanjay : కవిత ఇష్యూపై బండి సంజయ్ సంచలన కామెంట్స్.. వాళ్లంతా కలిసి ఆడుతున్న డ్రామా..
మీడియా సమావేశం అనంతరం ఆమె చిట్‌చాట్‌లో మాట్లాడారు. నేను కేసీఆర్‌కు రాసిన లేఖను లీక్ చేసింది సంతోష్ అని కవిత చెప్పారు. మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయని, కేటీఆర్‌కు సంబంధించిన వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని కవిత అన్నారు. హరీశ్ రావు, సంతోష్, శ్రవణ్ లే ఫోన్ ట్యాపింగ్ చేయించారని కవిత చెప్పుకొచ్చారు. ఇకనుంచి ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పిన కవిత.. తన తండ్రి కేసీఆర్ ఫొటోతోనే నేను కార్యక్రమాలు చేపడతానని అన్నారు.