presidential election 2022: నేను రాష్ట్రపతినైతే సీసీఏ అమ‌లు కాకుండా చూస్తాను: య‌శ్వంత్ సిన్హా

రాష్ట్రపతి ఎన్నిక‌లో తాను గెలిస్తే దేశంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమ‌లు కాకుండా చూస్తాన‌ని విప‌క్ష పార్టీల అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమ‌లు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోన్న వేళ దీనిపై ప్ర‌తిప‌క్ష పార్టీలు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే.

presidential election 2022: నేను రాష్ట్రపతినైతే సీసీఏ అమ‌లు కాకుండా చూస్తాను: య‌శ్వంత్ సిన్హా

Yashwanth

Updated On : July 13, 2022 / 7:04 PM IST

presidential election 2022: రాష్ట్రపతి ఎన్నిక‌లో తాను గెలిస్తే దేశంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమ‌లు కాకుండా చూస్తాన‌ని విప‌క్ష పార్టీల అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమ‌లు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోన్న వేళ దీనిపై ప్ర‌తిప‌క్ష పార్టీలు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. రాష్ట్రప‌తి ఎన్నిక‌లో మ‌ద్దతు కోర‌డానికి య‌శ్వంత్ సిన్హా దేశ వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయ‌న నేడు అసోంలో నేత‌లతో మాట్లాడారు. సీసీఏను కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌లేక‌పోతోంద‌ని, ముసాయిదాను తెలివిత‌క్కువ త‌నంతో రూపొందించ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని య‌శ్వంత్ సిన్హా అన్నారు.

Afghan girls: తాలిబన్ల పాలనలో అగమ్యగోచరంగా అఫ్గాన్ బాలికల పరిస్థితి

క‌రోనా కార‌ణంగా సీసీఏను అమ‌లు చేయ‌లేక‌పోతున్నామ‌ని ఇంత‌కు ముందు ప్ర‌భుత్వం చెప్పింద‌ని, అయితే, ఇప్పుడు కూడా దాన్ని అమ‌లు చేయ‌లేక‌పోతోంద‌ని విమ‌ర్శించారు. అసోంలో పౌర‌స‌త్వం అనేది కీల‌క విష‌యం అని చెప్పారు. దేశ రాజ్యాంగానికి బ‌య‌టి శ‌క్తుల నుంచి కాకుండా ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న వారి నుంచే ముప్పు పొంచి ఉంద‌ని అన్నారు. రాజ్యాంగాన్ని ర‌క్షించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. కాగా, జూలై 18న రాష్ట్రప‌తి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. భావసారూప్యంగ‌ల పార్టీలతో సిన్హా స‌మావేశం అవుతున్నారు.