Kanpur violence: అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు మళ్లీ బయలుదేరనున్న బుల్డోజర్లు!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో పాల్గొన్న వారి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ఏడీజీ (శాంతి, భద్రతలు) ప్రశాంత్ కుమార్ తెలిపారు.

Up Violance
Kanpur violence: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో పాల్గొన్న వారి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ఏడీజీ (శాంతి, భద్రతలు) ప్రశాంత్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం కాన్పూర్‌లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఆయన వివరించారు. మరికొంతమంది నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితుల ఇళ్లను కూల్చేసేందుకు మళ్లీ బుల్జోజర్లు బయలుదేరే అవకాశం ఉంది.
Uttar Pradesh Violence: రాష్ట్రపతి, ప్రధాని పర్యటన రోజే హింస జరగడం దురదృష్టకరం: మాయావతి
ఇటీవల ఢిల్లీలోనూ కొన్ని అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చి వేయడానికి అధికారులు వెళ్లగా ఆ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కాగా, కాన్పూర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి రాళ్లు రువ్వుకున్న విషయం తెలిసిందే. మహమ్మద్ ప్రవక్తపై ఓ బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు చేయడంలో ఈ ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే 36 మంది నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు మూడు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. హింసాత్మక ఘర్షణ మరోసారి తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.