India : రికార్డు స్థాయికి పెట్రోల్ ధరలు, హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్

దేశంలో చమురు ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు ధరలు పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బేంబెలెత్తిపోతున్నారు.

India : రికార్డు స్థాయికి పెట్రోల్ ధరలు, హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్

Petrol

Updated On : October 2, 2021 / 11:00 AM IST

India Petrol Price : దేశంలో చమురు ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు ధరలు పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బేంబెలెత్తిపోతున్నారు. వీటి ధరల ఎఫెక్ట్ ఇతర వాటిపై పడుతున్నాయి. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేదు అంటున్నారు జనాలు. తాజాగా..మరోసారి పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

Read More : Cyclone : షహీన్ దూసుకొస్తోంది..అప్రమత్తంగా ఉండండి

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా…దేశీయ పెట్రోలియం కంపెనీలు మాత్రం…వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ వస్తున్నాయి. లీటర్ పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్ పై 33 పైసలు పెరిగింది. దీంతో పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 102.14 చేరగా..డీజిల్ ధర రూ. 90.47కి చేరుకుంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.25, డీజిల్ ధర రూ. 98.72గా ఉంది.

Read More : Babu Mohan : పవన్, పోసాని ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు.. బాబు మోహన్ ఫైర్

ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ లీటర్ పెట్రోల్ రూ. 102.14. లీటర్ డీజిల్ రూ. 90.17
కోల్ కతా లీటర్ పెట్రోల్ రూ. 102.77. లీటర్ డీజిల్ రూ.93.27
ముంబాయి లీటర్ పెట్రోల్ రూ. 108.19. లీటర్ డీజిల్ రూ. 97.84
చెన్నై లీటర్ పెట్రోల్ రూ. 99.80 లీటర్ డీజిల్ రూ. 94.74

Read More : Babu Mohan : పవన్, పోసాని ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు.. బాబు మోహన్ ఫైర్

గుర్ గావ్ లీటర్ పెట్రోల్ రూ. 99.98 లీటర్ డీజిల్ రూ. 91.19
నోయిడా లీటర్ పెట్రోల్ రూ. 99.31 లీటర్ డీజిల్ రూ. 90.94
బెంగళూరు లీటర్ పెట్రోల్ రూ. 105.69 లీటర్ డీజిల్ రూ. 96.02

Read More : AP High Court : గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను నిలిపివేసిన ఏపీ హైకోర్టు

భువనేశ్వర్ లీటర్ పెట్రోల్ రూ. 103.01 లీటర్ డీజిల్ రూ. 98.65
చండీఘడ్ లీటర్ పెట్రోల్ రూ. 98.32 లీటర్ డీజిల్ రూ. 90.20
హైదరాబాద్ లీటర్ పెట్రోల్ రూ. 106.26 లీటర్ డీజిల్ రూ. 98.72
జైపూర్ లీటర్ పెట్రోల్ రూ. 108.98 లీటర్ డీజిల్ రూ. 99.63