ఇండియాలో ఫస్ట్ టైం.. ఒక్క రోజులో నమోదైన కొవిడ్ కేసులు .. 10వేలు

  • Published By: srihari ,Published On : June 12, 2020 / 11:35 AM IST
ఇండియాలో ఫస్ట్ టైం.. ఒక్క రోజులో నమోదైన కొవిడ్ కేసులు .. 10వేలు

Updated On : June 12, 2020 / 11:35 AM IST

భారతదేశంలో ఒక్క రోజులో తొలిసారిగా 10వేలకు  పైగా కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకూ దేశంలో పెరిగిన కరోనా కేసులతో కలిపి మొత్తంగా 2,97,535 కేసులు నమోదు కాగా.. కరోనా మరణాల సంఖ్య కూడా 8,498కి చేరింది. ఈ సంఖ్య ఒక రోజులో 396 మంది కరోనాతో మృతిచెందడంతో ఒక్కసారిగా భారీగా పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. గత 24 గంటల్లో శుక్రవారం ఉదయం 8 గంటల వరకు భారతదేశంలో 10,956 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

గురువారం రోజున యూనైటెడ్ కింగ్ డమ్‌లో కరోనా కేసులను భారత్ దాటేసింది. ప్రపంచ మీటర్ ప్రకారం.. కరోనా ప్రభావిత దేశాల్లో నాల్గో స్థానంలో భారత్ నిలిచింది. వరుసగా మూడో రోజు కూడా పెరిగిన యాక్టివ్ కొత్త కరోనా కేసుల కంటే వ్యాధి నుంచి కోలుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. 

ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 1,41,842 ఉంటే.. కోలుకున్న వారి సంఖ్య 1,47,194 మందిగా నమోదైంది. వీరిలో ఒకరు విదేశాలకు వలస వెళ్లినట్టు గుర్తించారు. ఇప్పటివరకూ భారతదేశంలో మొత్తంగా 49.47 శాతం మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు అధికారి ఒకరు వెల్లడించారు. కరోనా ధ్రువీకరించిన మొత్తం కేసుల్లో ఎక్కువ మంది విదేశీయులే ఉన్నారు.