Indian Army..Eagles : డ్రోన్లను కూల్చివేయటానికి గరుడపక్షులకు భారత ఆర్మీ ట్రైనింగ్
ఈక్రమంలో భారత్ గగనతలంలోకి ఎటువంటి డ్రోన్ వచ్చినా దాని కూల్చివేసేందుకు భారత్ ఆర్మీ వినూత్న విధానం అవలంభించనుంది. డ్రోన్లను కూల్చివేయటానికి గ్రద్దలను రంగంలోకి దించుతోంది. గాల్లో ఎగిరే డ్రోన్లను అడ్డుకోవడానికి గద్దలకు ట్రైనింగ్ ఇస్తోంది.

Indian Army is training eagles to fight Pakistani drones
Indian Army..Eagles : ఇటీవల కాలంలో భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో డ్రోన్లను భారత్ ఆర్మీ కూల్చివేస్తున్న ఘటనలు తరచు జరుగుతున్నాయి. పాక్ నుంచి భారత గగనతలంలోకి డ్రోన్లు చొరబడడం ఎక్కువైంది. వాటిని మన ఆర్మీ పసిగట్టి సమర్థవంతంగా కూల్చివేస్తోంది. సరిహద్దు భద్రతా బలగాలు కూల్చివేస్తున్నా నిరంతరం ఇదో పనిగా మారిపోయింది భారత్ ఆర్మీకి.
ఈక్రమంలో భారత్ గగనతలంలోకి ఎటువంటి డ్రోన్ వచ్చినా దాని కూల్చివేసేందుకు భారత్ ఆర్మీ వినూత్న విధానం అవలంభించనుంది. డ్రోన్లను కూల్చివేయటానికి గద్దలను (గరుడపక్షి) రంగంలోకి దించుతోంది. గాల్లో ఎగిరే డ్రోన్లను అడ్డుకోవడానికి గద్దలకు ట్రైనింగ్ ఇస్తోంది. డ్రోన్లను కట్టడి చేసేందుకు గద్దలను ఉపయోగించడం ఇదే మొదటిసారి కావటం విశేషం.
ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో భారత్, అమెరికా సంయుక్తంగా చేపడుతున్న సైనిక విన్యాసాలు యుద్ధ్ అభ్యాస్ లో భాగంగా గద్దలు డ్రోన్లను కూల్చివేయడాన్ని ప్రదర్శించారు. ఓ డ్రోన్ ను ఆర్మీ సిబ్బంది గాల్లో ఎగురవేయగా, ఆర్మీకిని ఓ శునకం దాన్ని గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేసింది.
Pakistan Drone Shot Down : భారత్ లోకి ప్రవేశించిన పాక్ డ్రోన్ కూల్చివేత
వెంటనే సిబ్బంది తమ వద్ద ఉన్న శిక్షణ పొందిన అర్జున్ అనే గద్దను డ్రోన్ దిశగా గాల్లోకి వదిలారు. ఆ గద్ద డ్రోన్ ను గుర్తించి విజయవంతంగా నేలకూల్చింది. డ్రోన్లను గుర్తించడంలో గద్దలకే కాదు శునకాలకు కూడా భారత సైన్యం ట్రైనింగ్ ఇచ్చింది. ఇకనుంచి భారత గగనతలంలోని ఎటువంటి డ్రోన్ ప్రవేశించినా దాన్ని డేగ కళ్లతో గుర్తించి నేల కూల్చటం ఖాయం..మన గరుడు పక్షుల ప్రతిభతో..