ఐఫోన్ యూజర్లు ఈ కొత్త అప్‌డేట్ ఎందుకు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తమ ఐఫోన్ యూజర్ల కోసం కొత్త అప్ డేట్ ప్రవేశపెట్టింది. iOS 13.5.1 అప్ డేట్ రిలీజ్ చేసింది. గత నెలలోనే ఆపిల్ iOS 13.5 అప్ డేట్ రిలీజ్ చేసింది. కానీ, అందులోని భద్రపరమైన లోపాల కారణంగా కీలకమైన Unc0ver jailbreak బహిర్గతమయ్యేలా చేసింది.
ఈ కొత్త అప్ డేట్‌ను ఫిక్స్ చేసిన ఆపిల్.. ఐఫోన్ 6S, ఆ తర్వాతి వెర్షన్లు, ఐప్యాడ్ ఎయిర్ 2, ఆపై వెర్షన్లు, ఐప్యాడ్ మిని 4, ఆపై వెర్షన్లు, ఐప్యాడ్ టచ్ 7వ జనరేషన్ మోడళ్లలో ఈ కొత్త లేటెస్ట్ అప్ డేట్ రిలీజ్ అయింది. iPadOS 13.5.1 కొత్త అప్ డేట్ కూడా లోపాలను ఫిక్స్ చేసిన తర్వాత కంపెనీ రిలీజ్ చేసింది. Unc0ver jailbreakలో తలెత్తిన లోపాలను ఫిక్స్ చేసినట్టు ఆపిల్ సపోర్ట్ పేజీలో ధ్రువీకరించింది. కానీ, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వలేదు.
కొత్త అప్ డేట్ లోని కీలకమైన వివరాలు ఇవే :
కెర్నల్ : ఈ కొత్త అప్ డేట్.. ఆపిల్ యూజర్లు వాడే iPhone 6s and later, iPad Air 2 and later, iPad mini 4 and later, and iPod touch 7వ జనరేషన్ మోడళ్లలో అందుబాటులో ఉంటుంది.
ఇంపాక్ట్ : ఈ అప్లికేషన్‌లోని అర్బిటరీ కోడ్ ను కెర్నల్ ప్రివిలైజెస్‌తో ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. మెమరీ కంజ్యూమ్షన్ సమస్యను తగ్గించి మెమెరీ సామర్థ్యాన్ని పెంచింది. CVE-2020-9859: unc0ver
Update : ఐఫోన్ యూజర్లకు లేటెస్ట్ iOS 13.5.1 అప్ డేట్ చేసుకోవాలంటే… Settingsలోకి వెళ్లండి. ఇక్కడ General సెలెక్ట్ చేసుకోండి. Software Update పై ట్యాప్ చేయండి. ఈ అప్ డేట్ సపోర్ట్ చేసే ఐఫోన్లు తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకుని అప్ డేట్ చేసుకోవాలి.
Read: మీ మూడ్ మార్చేసే.. రంగుల కూల్ కళ్ల అద్దాల సీక్రెట్ తెలుసుకోవాల్సిందే!