Monk Amogh Lila Das : స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సన్యాసిపై ఇస్కాన్ వేటు
స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసలపై వ్యాఖ్యలు చేసినందుకు గాను సన్యాసి అమోఘ్ లీలా దాస్ పై ఇస్కాన్ వేటు వేసింది. సోషల్ మీడియాలో చాలామంది అభిమానుల్ని కలిగిన ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

Monk Amogh Lila Das
Monk Amogh Lila Das : స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసలపై వ్యాఖ్యలు చేసినందుకు గాను ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ISKON) నిషేధం విధించింది. అతను చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Delhi Metro Train : మెట్రో రైలులో ఇన్ స్టాగ్రామ్ రీల్స్ రికార్డింగ్ నిషేధం
43 సంవత్సరాల అమోఘ్ లీలా దాస్ ఒక సన్యాసి.. ఆధ్యాత్మిక కార్యకర్తగా మోటివేషనల్ స్పీకర్‌గా ఉన్నారు. ఇస్కాన్‌తో ఆయనకు 12 సంవత్సరాల అనుబంధం ఉంది. ప్రస్తుతం ద్వారక చాప్టర్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన అసలు పేరు ఆశిష్ అరోరా. లక్నోలోని పంజాబీ కుటుంబంలో ఆయన జన్మించారు. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో ఆయన నివాసం ఉంటున్నారు.
2004 లో సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందిన తరువాత US చెందిన మల్టీ నేషనల్ కంపెనీలో పని చేశారు. 2010 లో కార్పొరేట్ వరల్డ్‌ని వదిలిపెట్టి 29 సంవత్సరాల వయసులో ఇస్కాన్‌లో చేరడం ద్వారా సన్యాసిగా మారారు. సోషల్ మీడియాలో చాలామంది అభిమానుల్ని కలిగిన ఆయన మతం, ప్రేరణ గురించి చేసే వీడియోలు వైరల్ అవుతాయి.
తాజాగా స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసలపై వ్యాఖ్యలు చేసినందుకు గాను ఇస్కాన్ నుంచి నిషేధం ఎదుర్కుంటున్నారు. స్వామి వివేకానంద చేపలు తిన్నారని, సద్గురువు జీవికి ఎప్పటికీ హాని కలిగించలేడని విమర్శించిన ఆయన వివాదాస్పదమయ్యారు. అలాగే స్వామి వివేకానంద గురువు రామకృష్ణ బోధించిన “జాతో మత్ తతో మార్గం” గురించి అమోఘ్ లీలా దాస్ ‘‘ప్రతి మార్గం ఒకే గమ్యానికి దారితీయదు’’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆయనపై ఇస్కాన్ నిషేధం విధించింది.