Janhvi Kapoor: తారక్ పేరు చెప్పుకుని ఇప్పుడు ఆ హీరో సినిమా కోసం ప్రయత్నిస్తోన్న జాన్వీ!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సౌత్ ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన శ్రీదేవి కూతురిగా సుపరిచితురాలే. ఆమె బాలీవుడలో పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది. అయితే అమ్మడికి అనుకున్న స్థాయిలో మాత్రం ఇంకా స్టార్‌డమ్ రాలేదని ఆమె అభిమానులు ఫీలవుతున్నారు. ఇక బాలీవుడ్ జనాలను మెప్పించిన ఈ బ్యూటీ, ఇప్పుడు దక్షిణాదిన అదిరిపోయే ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.

Janhvi Kapoor: తారక్ పేరు చెప్పుకుని ఇప్పుడు ఆ హీరో సినిమా కోసం ప్రయత్నిస్తోన్న జాన్వీ!

Janhvi Kapoor Trying To Act In Ram Charan Movie

Updated On : November 29, 2022 / 5:54 PM IST

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సౌత్ ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన శ్రీదేవి కూతురిగా సుపరిచితురాలే. ఆమె బాలీవుడలో పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది. అయితే అమ్మడికి అనుకున్న స్థాయిలో మాత్రం ఇంకా స్టార్‌డమ్ రాలేదని ఆమె అభిమానులు ఫీలవుతున్నారు. ఇక బాలీవుడ్ జనాలను మెప్పించిన ఈ బ్యూటీ, ఇప్పుడు దక్షిణాదిన అదిరిపోయే ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.

Janhvi Kapoor : నేను సౌత్ అమ్మాయినే.. మరోసారి సౌత్ సినిమాలపై జాన్వీ వ్యాఖ్యలు..

ఈ క్రమంలోనే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్స్‌లో పదేపదే తెలుగు హీరోల పేరును జపంగా చేస్తూ వచ్చింది ఈ బ్యూటీ. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఎప్పటికైనా ఆయనతో ఒక్క సినిమాలో నటించాలని జాన్వీ తన మనసులోని మాటను పదేపదే మీడియా ముందు చెబుతూ వచ్చింది. ఇక ఇప్పుడు మరో తెలుగు స్టార్ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతోంది ఈ బ్యూటీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీని తాజాగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Janhvi Kapoor : నాపై ట్రోలింగ్ కి ఆ నిర్మాతే కారణం..

దర్శకుడు బుచ్చిబాబు సానాతో కలిసి చరణ్ తన కెరీర్‌లోని 16వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేయాలని జాన్వీ ప్రయత్నిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి తారక్ పేరు చెప్పుకుని టాలీవుడ్ మీడియా దృష్టిని తనవైపు తిప్పుకున్న జాన్వీ, ఇప్పుడు చరణ్ సినిమాలో అవకాశాన్ని పట్టుకుంటుందా లేదా అనేది చూడాలి.