Jeevitha Rajasekhar : ట్రయాంగిల్‌ వార్‌.. ‘మా’ అధ్యక్ష బరిలో జీవిత రాజశేఖర్..

ఇప్పటికే అధ్యక్ష బరిలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌తో పాటు మంచు విష్ణు పోటీకి దిగుతుండగా.. ఇప్పుడు వారిద్దర్నీ ‘ఢీ’ కొడతానంటున్నారు జీవిత రాజశేఖర్‌..

Jeevitha Rajasekhar : ట్రయాంగిల్‌ వార్‌.. ‘మా’ అధ్యక్ష బరిలో జీవిత రాజశేఖర్..

Jeevitha Rajasekhar

Updated On : June 22, 2021 / 8:01 PM IST

Jeevitha Rajasekhar: ‘మా’ లో రాజకీయం వేడెక్కింది. త్వరలో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష బరిలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌తో పాటు మంచు విష్ణు పోటీకి దిగుతుండగా.. ఇప్పుడు వారిద్దర్నీ ‘ఢీ’ కొడతానంటున్నారు జీవిత రాజశేఖర్‌.

MAA Elections : రసవత్తరంగా ‘మా’ ఎలక్షన్స్.. అధ్యక్ష పదవికి మంచు విష్ణు – ప్రకాష్ రాజ్ పోటీ..!

ప్రస్తుతం మా ప్రధాన కార్యదర్శిగా ఉన్న జీవిత, ఇప్పుడు అధ్యక్ష బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడంతో ఈసారి ట్రయాంగిల్‌ వార్‌తో మరింత ఆసక్తిని రేపుతున్నాయి ‘మా’ ఎన్నికలు.

తనకు కృష్ణంరాజు, కృష్ణ మద్దతు ఉందంటూ మంచు విష్ణు ఇప్పటికే ప్రకటించగా.. ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వాన్ని నాగబాబు బలపరుస్తున్నారు. దీంతో ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి.

Manchu Vishnu : వారి మద్దతుతో విష్ణు గెలుపుకి ఎక్కువ అవకాశం..!

2019 ఎన్నికల్లో శివాజీరాజా, నరేష్ ప్యానల్‌ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇప్పుడు విష్ణు, ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్‌ల మధ్య పోటీతో మరోసారి ‘మా’ లో ఆసక్తికరమైన పోరు నెలకొంది.