King Cobra Entered Bedsheet : యువకుడి దుప్పట్లో దూరిన నాగుపాము.. రాత్రంతా అతని పక్కలోనే
నాగు పాము పేరు వినగానే శరీరమంతా వణికిపోతోంది. నాగుపామును చూస్తే భయంతో పరుగలు పెడతారు. అలాంటిది ఓ నాగుపాము ఏకంగా యువకుడి దుప్పట్లోనే దూరింది. రాత్రంతా అతనితో పాటు నిద్రించింది. తెల్లారిన తర్వాత దుప్పట్లో దాక్కున్న పామును చూసిన యువకుడు భయంతో వణికిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

King Cobra
King Cobra Entered Bedsheet : నాగు పాము పేరు వినగానే శరీరమంతా వణికిపోతోంది. నాగుపామును చూస్తే భయంతో పరుగలు పెడతారు. అలాంటిది ఓ నాగుపాము ఏకంగా యువకుడి దుప్పట్లోనే దూరింది. రాత్రంతా అతనితో పాటు నిద్రించింది. తెల్లారిన తర్వాత దుప్పట్లో దాక్కున్న పామును చూసిన యువకుడు భయంతో వణికిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
సిరోజంలో ఓ యువకుడు రాత్రి 10 గంటల సమయంలో నిద్రకు ఉపక్రమించాడు. దుప్పటి కప్పుకున్న యువకుడి వద్దకు మెల్లిగా నల్ల నాగుపాము చేరింది. అతడు కప్పుకున్న దుప్పట్లోకి దూరింది. కానీ యువకుడికి ఎలాంటి హానీ కలిగించలేదు. ఉదయం 6 గంటలకు యువకుడికి మెలకువ వచ్చింది. బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది.
Cobra Inside Scooter : బుసలుకొడుతున్న నాగుపామును చేత్తో పట్టుకున్న వ్యక్తి
పక్కలే ఉన్న నాగు పామును చూసి అతడికి చెమటలు పట్టాయి. భయంతో బయటకు పరుగులు తీశాడు. వెంటనే పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. పాములు పట్టే వ్యక్తి వచ్చి.. దుప్పట్లో దూరిన నాగుపామును పట్టేశాడు. అయితే ఇలాంటి పాములు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ వంటి దేశాల్లో కనిపిస్తాయని స్నేక్ క్యాచర్ తెలిపారు.