Kodali Nani: టీడీపీకి ప్రజలు సమాధి కడతారు: కొడాలి నాని

టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రజలు సమాధి కడతారని విమర్శించారు వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని. టీడీపీ కార్యకర్తలు, నాయకులను నమ్మించడానికి చంద్రబాబు మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారని నాని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Kodali Nani: టీడీపీకి ప్రజలు సమాధి కడతారు: కొడాలి నాని

Kodali Nani

Updated On : May 27, 2022 / 10:27 PM IST

Kodali Nani: టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రజలు సమాధి కడతారని విమర్శించారు వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని. టీడీపీ కార్యకర్తలు, నాయకులను నమ్మించడానికి చంద్రబాబు మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారని నాని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

Ambassador Car: మళ్లీ భారత్ రోడ్లపైకి రానున్న అంబాసిడర్ కార్లు: ఈసారి ఎలక్ట్రిక్ వేరియంట్‌లలో

‘‘చంద్రబాబు ఆధ్వర్యంలో, 420ల సహాయంతో మహానాడు పేరుతో పండుగ చేస్తున్నారు. ఎప్పుడూ చెప్పే మాటలే చంద్రబాబు ఇప్పుడు కూడా నొక్కి వక్కాణిస్తున్నారు. జగన్‌ను తరిమి కొట్టడం నీ తరం కాదు. కొట్టుకొచ్చిన పార్టీకి నాయకుడు చంద్రబాబు అయితే.. స్థాపించిన పార్టీకి నాయకుడు జగన్. అప్పట్లో చంద్రబాబు జామాత దశమ గ్రహం అనే ఆడియో క్యాసెట్‌ను ఎన్టీఆర్ విడుదల చేశారు. జగన్ ఉన్మాది కాదు. చంద్రబాబు కంటే ఉన్మాది ఎవరూ ఉండరు. ఎన్టీఆర్ అనే పేరు వింటే చంద్రబాబుకు నిద్రపట్టదు. రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు. ప్రతిపక్షానికి కూడా పనికిరావని 2019లో ప్రజలు 23 సీట్లే ఇచ్చారు. అమలాపురంలో మా మంత్రి, ఎమ్మెల్యే ఇండ్లను తగులబెట్టించావు. టీడీపీ, నిక్కర్ల బ్యాచ్ వైసీపీ నాయకుల ఇండ్లను తగులబెట్టించావు. మేమే ఇండ్లు కట్టుకుని, మేమే నిప్పు పెట్టుకుంటామా?

OP Chautala: అక్రమాస్తుల కేసు.. మాజీ సీఎంకు జైలు శిక్ష

జగన్‌ను ఇష్టమొచ్చినట్లు తిట్టిస్తున్నారు. పార్టీయే లేదని చెప్పిన అచ్చెన్నాయుడు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నవగ్రహాలు అంటే వైసీపీ.. దశమ గ్రహం అంటే టీడీపీ. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన అభిమానులు చంద్రబాబును రాష్ట్రం దాటించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జగన్ డెబ్బై శాతంపైగా అధికారాలను కట్టబెట్టారు’’ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.