Kolo Kolanna Kolo​ Song : ‘యమ ధైర్యంగా ఎదురెళ్లి నిలుచుంటే నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా’..

తన పాటలతో ప్రేక్షకులను అభిమానులుగా ఏకలవ్య శిష్యులుగా మార్చుకున్నారు ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి.. ప్రేమకథ అయినా, కుటుంబ కథ అయినా.. మారుతున్న జెనరేషన్‌తో పోటీ పడి పాట రాయడం, రాసి మెప్పించడం సిరివెన్నెలకే సాధ్యం అన్నంతగా ఆకట్టుకునేలా బాణీకి సాహిత్యం సమకూర్చడం ఆయనకే చెల్లింది..

Kolo Kolanna Kolo​ Song : ‘యమ ధైర్యంగా ఎదురెళ్లి నిలుచుంటే నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా’..

Kolo Kolanna Kolo​ Song

Updated On : March 13, 2021 / 7:47 PM IST

Kolo Kolanna Kolo​ Song: తన పాటలతో ప్రేక్షకులను అభిమానులుగా ఏకలవ్య శిష్యులుగా మార్చుకున్నారు ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి.. ప్రేమకథ అయినా, కుటుంబ కథ అయినా.. మారుతున్న జెనరేషన్‌తో పోటీ పడి పాట రాయడం, రాసి మెప్పించడం సిరివెన్నెలకే సాధ్యం అన్నంతగా ఆకట్టుకునేలా బాణీకి సాహిత్యం సమకూర్చడం ఆయనకే చెల్లింది..

Sirivennela

నేచురల్ స్టార్ నాని, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా.. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సున్నితమైన ప్రేమకథల్ని తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న చిత్రం ‘టక్ జగదీష్’.. ఈ సినిమాలో ‘కోలో కోలన్న కోలో’ అనే లిరికల్ సాంగ్ శనివారం రిలీజ్ చేశారు.
థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా, సిరివెన్నెల లిరిక్స్ రాశారు. అర్మాన్ మాలిక్, హరిణి ఇవ్వటూరి, శ్రీకృష్ణలతో పాటు థమన్ కూడా గొంతు కలిపారు.

Tuck Jagadish

‘కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి.. కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్లల్లో కొలువుండాలి.. ఆరారు రుతువుల్లోని అక్కర్లేనిది ఏముంది.. చూడాలే గానీ మన్నే రంగుల పూదోటౌతుంది.. తోడై నీవెంట కడదాకా నేనుంటా.. రాళ్లైనా ముళ్లైనా మన అడుగులు పడితే పూలై పొంగాలా.. నువ్వు దీనంగా ఏ మూలో కూర్చుంటే.. నిను వెంటాడే దిగులే వెలిపోతుందా.. యమ ధైర్యంగా ఎదురెళ్లి నిలుచుంటే నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా’’.. అంటూ ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేసే పదాలు రాశారు సిరివెన్నెల..

Tuck Jagadish

విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్‌గా రూపొందుతున్న ‘టక్ జగదీష్’ లో సీనియర్ హీరో జగపతి బాబు, నాని అన్నయ్యగా కనిపించనున్నారు. 2021 ఏప్రిల్ 23న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కెమెరా : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి.