Kriti Sanon : సోలోగా క్రెడిట్ దక్కడంలేదు.. సీత ఆశలన్నీ ‘ఆదిపురుష్’ పైనే..
7 ఏళ్లు.. 14 సినిమాలు.. హీరోయిన్‌గా సూపర్ ఫామ్‌లో ఉన్న కథానాయిక హిస్టరీ. స్టార్ హీరోల పక్కన సినిమాలు చేస్తున్నా, చిన్న హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నా.. సక్సెస్ వస్తోంది కానీ సోలోగా క్రెడిట్ మాత్రం రావడం లేదు ఈ బ్యూటీకి. మరి అన్ని ఆశలూ ప్రజెంట్ ప్రభాస్‌తో చేస్తున్న పాన్ ఇండియా సినిమా మీదే పెట్టుకున్న ఆ సీత ఎవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్..

Kriti Sanon
Kriti Sanon: 7 ఏళ్లు.. 14 సినిమాలు.. హీరోయిన్‌గా సూపర్ ఫామ్‌లో ఉన్న కథానాయిక హిస్టరీ. స్టార్ హీరోల పక్కన సినిమాలు చేస్తున్నా, చిన్న హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నా.. సక్సెస్ వస్తోంది కానీ సోలోగా క్రెడిట్ మాత్రం రావడం లేదు ఈ బ్యూటీకి. మరి అన్ని ఆశలూ ప్రజెంట్ ప్రభాస్‌తో చేస్తున్న పాన్ ఇండియా సినిమా మీదే పెట్టుకున్న ఆ సీత ఎవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్..
2014 లో ‘1- నేనొక్కడినే’ మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది టాల్ బ్యూటీ కృతి సనన్. ఎంట్రీ సినిమానే టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుతో అదరగొట్టింది. సినిమా పెద్దగా జనాలకు ఎక్కకపోయినా హీరోయిన్‌గా మాత్రం ఎట్రాక్ట్ చేసింది. ఇక అదే సంవత్సరం బాలీవుడ్‌లో కూడా ‘హీరోపంతి’ సినిమాతో బోణీ కొట్టింది. హిందీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తెలుగులో ‘దోచెయ్’ సినిమా చేసినా.. అదికూడా పెద్దగా వర్కౌట్ కాలేదు .
వరుసగా బాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన పెద్ద సినిమాలు, చిన్న హీరోలతో ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తూనే ఉంది. సినిమా హిట్ అయితే అవుతోంది కానీ.. పాపకి సోలోగా క్రెడిట్ మాత్రం రావడం లేదు. 2018 వరకూ కెరీర్ ఎలా ఉన్నా.. ఆ తర్వాత నుంచి ‘హౌస్ ఫుల్’, ‘పానిపట్’, ‘పతీ పత్నీ ఔర్ ఓ’ సినిమాలతో వరుసగా ఛాన్సులు దక్కించుకుంటోంది కృతి. ఇప్పుడు ‘మిమి’, ‘బచ్చన్ పాండే’, ‘బేడియా’, ‘హమ్ దో హమారే దో’ సినిమాలతో బిజీగా ఉంది.
బ్యాక్ టు బ్యాక్ ఎన్ని సినిమాలు చేస్తున్నా.. ఓన్లీ గ్లామర్ డాల్‌గా కాకుండా ‘పానిపట్’ లాంటి సినిమాల్లో పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేస్తున్నా.. పెద్దగా గుర్తింపు మాత్రం రావడం లేదు కృతికి. అందుకే తన ఆశలన్నీ.. ప్రస్తుతం ప్రభాస్‌తో చేస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా మీదే పెట్టుకుంది.. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో కృతి సీత పాత్రలో కనిపించనుంది.. ఈ మూవీతో అయినా తనకు మంచి బ్రేక్ రావాలని, క్రేజ్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటోంది కృతి సనన్..