KTR-Sonu Sood : నిజంగా సోనూసూద్ ‘సూపర్ హీరో’ – మంత్రి కేటీఆర్

నటుడు సోనూ సూద్ నిజంగా ‘సూపర్ హీరో’ అని మంత్రి కేటీఆర్ కొనియాడారు..

KTR-Sonu Sood : నిజంగా సోనూసూద్ ‘సూపర్ హీరో’ – మంత్రి కేటీఆర్

Ktr Praises Actor Sonu Sood

Updated On : June 1, 2021 / 1:36 PM IST

KTR – Sonu Sood: కరోనా కష్టకాలంలో చేతికి ఎముకలేదు అనే విధంగా అలుపు లేకుండా అహర్నిశలూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ‘హెల్పింగ్ హ్యాండ్’, ‘రియల్ హీరో’ అనిపించుకుంటున్న నటుడు సోనూ సూద్ నిజంగా ‘సూపర్ హీరో’ అని మంత్రి కేటీఆర్ కొనియాడారు..

సోనూ సూద్ లక్షలాది మందికి ఆదర్శంగా నిలిచారని ట్వీట్ చేశారు కేటీఆర్.. ఆ ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘మీ దయగల మాటలకు చాలా ధన్యవాదాలు కేటీఆర్ సార్! మీరు నిజంగా తెలంగాణ కోసం ఎంతో చేసిన హీరో.. మీ నాయకత్వంలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది.. నేను తెలంగాణను నా రెండవ ఇళ్లుగా, నా పని ప్రదేశంగా భావిస్తాను.. ప్రజలు సంవత్సరాలుగా నాపై చాలా ప్రేమను చూపిస్తున్నారు.. అని సోనూ సూద్ రిప్లై ఇచ్చారు.

‘మీ దయగల మాటలకు చాలా ధన్యవాదాలు బ్రదర్ సోనూ సూద్.. మీరు ఇలాగే ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చెయ్యాలి’ అంటూ కేటీఆర్ బదులిచ్చారు.. ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ.. వారి పాలిట దేవుడిగా నిలిచారు సోనూ సూద్‌..