Lunar Eclipse 2022 : భారత్‌లో ముగిసిన చంద్రగ్రహణం.. కనువిందు చేసిన బ్లడ్ మూన్, మళ్లీ 2025లోనే

గ్రణహం వీడింది. ఖగోళ శాస్త్రంలో అద్భుతంగా చెప్పుకునే చంద్రగ్రహణం పూర్తయింది. బ్లడ్ మూన్ కనువిందు చేసింది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో గంటపాటు గ్రహణం ఏర్పడగా..

Lunar Eclipse 2022 : భారత్‌లో ముగిసిన చంద్రగ్రహణం.. కనువిందు చేసిన బ్లడ్ మూన్, మళ్లీ 2025లోనే

Lunar Eclipse 2022 : గ్రణహం వీడింది. ఖగోళ శాస్త్రంలో అద్భుతంగా చెప్పుకునే చంద్రగ్రహణం పూర్తయింది. బ్లడ్ మూన్ కనువిందు చేసింది. గ్రహణం సమయంలో చంద్రుడు ఎర్రగా కనిపించాడు.

దేశంలో కొన్ని ప్రాంతాల్లో గంటపాటు గ్రహణం ఏర్పడగా.. మన దగ్గర (తెలుగు రాష్ట్రాల్లో) 39 నిమిషాలు కొనసాగింది. దేశంలో 2 గంటల 19 నిమిషాలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు కనిపించింది. అయితే, దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో చంద్రగ్రహణం ఏర్పడింది. ఈశాన్య రాష్ట్రాల్లో గంట ముందే చంద్రగ్రహణం ఏర్పడింది.

Lunar Eclipse 2022 : ఆకాశంలో అద్భుతం.. కొనసాగుతున్న చంద్రగ్రహణం, ఇప్పుడు మిస్ అయితే మళ్లీ 2025లోనే

ఇక, చంద్రగ్రహణంతో తెలుగు రాష్ట్రాల్లో మూతపడిన ఆలయాలు.. గ్రహణం వీడటంతో తిరిగి తెరుచుకుంటున్నాయి. ఈ ఏడాది ఇదే చిట్టచివరి చంద్రగ్రహణం. సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజుల్లోనే చంద్ర గ్రహణం కనువిందు చేసింది. మళ్లీ చంద్రగ్రణహం కనిపించేది మూడేళ్ల తర్వాత అంటే..2025లోనే. దేశంలో 2025 సెప్టెంబర్ 7న తిరిగి సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అయితే, పాక్షిక చంద్ర గ్రహణం మాత్రం 2023 అక్టోబర్‌లో కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.