MAA Elections 2021: ‘మా’లో మరో ట్విస్ట్.. నటి హేమకు షోకాజ్ నోటీసులు జారీ
'మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్' ఎన్నికలు ఎప్పటికప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల్లో కూడా అదే కొనసాగుతోంది. ఈక్రమంలో మా ఎన్నికల వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నటి హేమకు 'మా' షో కాజ్ నోటీసులు జారీ చేసింది.

Hema
MAA Elections 2021: ‘మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్’ ఎన్నికలు ఎప్పటికప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల్లో కూడా అదే కొనసాగుతోంది. ఈ క్రమంలో మా ఎన్నికల వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నటి హేమకు ‘మా’ షో కాజ్ నోటీసులు జారీ చేసింది. ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌పై హేమ చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలని కోరుతూ హేమకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
కాగా వివాదాస్పద వ్యాఖ్యలో వార్తల్లో నిలిచే నటి హేమ మరోసారి మా ఎన్నికలు విషయంలో నటుడు నరేష్ పై వ్యాఖ్యలు చేశారు. నరేష్ ‘మా’ ఎన్నికలు జరకుండా చేసి..అధ్యక్షుడిగా తానే కొనసాగాలని అనుకుంటున్నారని అందుకే చాకచక్యంగా పావులు కదుపుతురు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో హేమ క్రమ శిక్షణారాహిత్యంగా వ్యవహరించారంటూ షోకాజ్ నోటీసులు జారీచేశారు.
అంతేకాకుండా ప్రస్తుత ప్యానల్ ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా..ఉన్నదంతా ఖర్చు పెడుతోందంటూ..మా నిధుల దుర్వినియోగం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఆడియో బయటకు వచ్చింది. ‘మా’ ఎన్నికలు జరపాలంటూ హేమ సంతకాల సేకరణ ప్రారంభించారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాగా ఈ దఫా మా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమలతో పాటు సీవీఎల్ నరసింహారావు కూడా ఉండటం విశేషం.