Corona to Home Minister : మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సేకు రెండోసారి కరోనా
మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ మరోసారి కరోనా సోకింది. తనతో పాటు సమావేశాల్లో పాల్గొన్నవారంతా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు.

Maharashtra Home Minister Positive For Covid 19
Maharashtra Home Minister positive for COVID-19 : మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ కరోనా బారినపడ్డారు. స్వల్పంగా కరోనా లక్షణాలు బయటపడటంతో అనుమానం వచ్చి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, డాక్టర్ల సలహా ప్రకారం ఆహారం జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపారు.
Read more : Delhi : మహిళా రైతుల మీదకు దూసుకొచ్చిన ట్రక్కు..ముగ్గురు మృతి
తనకు పాజిటివ్ రావటంతో నాగపూర్, అమరావతి పర్యటనలో తనతో పాటు పాల్గొన్నవారంతా కరోనా పరీక్షలుచేయించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి దిలీప్ వాల్సే సూచించారు. మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ నేత, మంత్రి నవాబ్ మాలిక్‌లతో సమావేశానికి హాజరయ్యారు. కాగా మంత్రి దిలీవప్ వాల్సేకు గతంలో కూడా ఒకసారి కరోనా బారిన పడి కోలుకున్నారు. గత అక్టోబరులో కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ క్రమంలో నాగపూర్, అమరావతిలో పర్యటించిన సందర్భంగా మరోసారి కరోనా బారిన పడ్డారు. మంత్రి రెండు మోతాదుల టీకా కూడా తీసుకున్నా మరోసారి కరోనా సోకటం గమనించాల్సిన విషయం.
కాగా..బుధవారం మహారాష్ట్రలో 1,485 కొత్త కరోనావైరస్ కేసులు నమోదు కాగా..38 మరణాలు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల 66,06,536 కు చేరుకుంది. మరణాల సంఖ్య 1,40,098 కు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అధికారిక సమాచారం ప్రకారం, రాష్ట్రంలో ఇప్పుడు 19,480 మంది యాక్టివ్ కేసులున్నాయి.
Read more : Fish : అరుదైన చేప…కిలో రూ.13 వేలు