Mahesh Babu : కృష్ణ మరణంపై మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్..
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త విని.. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తాజాగా తండ్రి మరణం తరువాత మొదటిసారి మహేష్, కృష్ణ గురించి ట్వీట్ చేశాడు.

Mahesh Babu's emotional tweet on Krishna's death
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త విని.. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో అయన మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఒకే ఏడాది అన్నని, తల్లిని, తండ్రిని కోలుపోయి మహేష్ బాబు కుదేలై పోయాడు. తీవ్ర శోకంలో ఉన్న మహేష్ ని చూసి ప్రతి ఒక్కరి మనసు కరిగిపోయింది. ఆ శోకం నుంచి మహేష్ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్ధనలు చేశారు.
Mahesh Babu : కృష్ణానదిలో సూపర్ స్టార్ కృష్ణ అస్థికలు
తాజాగా తండ్రి మరణం తరువాత మొదటిసారి మహేష్, కృష్ణ గురించి ట్వీట్ చేశాడు. “మీ మరణం కూడా మీ జీవితంలా గొప్పగా ముగిసింది. డేరింగ్ అండ్ డాషింగ్ స్వభావంతో మీ జీవితాన్ని మీరు నిర్భయంగా గడిపారు. నా ఇన్స్పిరేషన్, నా ధైర్యం ఇంకా మీలో కనిపించే ఎన్నో గొప్ప లక్షణాలన్నీ.. మీతోపాటు అలాగే వెళ్లిపోయాయి. కానీ విచిత్రంగా నేను మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఫీల్ అవుతున్నా.
ఇంతకు ముందెన్నడూ అనుభవించని ఈ బలాన్ని నాలో అనుభవిస్తున్నాను. ఇప్పుడు నేను ధైర్యంగా ఉన్నాను. నీ వెలుగు నాలో ఎప్పటికీ ప్రకాశిస్తుంది. నీ లెగసీని నీకులాగానే ముందుకు తీసుకువెళ్తాను. నిన్ను మరింతగా గర్వ పడేలా చేస్తాను. లవ్ యూ నాన్నా.. మై సూపర్ స్టార్” అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు.
— Mahesh Babu (@urstrulyMahesh) November 24, 2022