Man Kills Friend: సిగరెట్లు అడిగితే ఇవ్వలేదని.. స్నేహితుడిని చంపిన వ్యక్తి

సిగరెట్లు అడిగితే ఇవ్వలేదని స్నేహితుడిని చంపేశాడో వ్యక్తి. మహారాష్ట్రలోని థానె జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. డోంబివిలిలో జయేశ్ జాధవ్ (38) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. అనంతరం ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు. అయితే, ఇంటికి చేరుకుంటున్న సమయంలో జయేశ్ జాధవ్ ను అతడి స్నేహితుడు ఒకరు (32) కొన్ని సిగరెట్లు ఇవ్వాలని అడిగాడు. ఇవ్వకపోవడంతో జయేశ్ ను చంపేశాడు.

Man Kills Friend: సిగరెట్లు అడిగితే ఇవ్వలేదని.. స్నేహితుడిని చంపిన వ్యక్తి

Updated On : November 12, 2022 / 9:17 PM IST

Man Kills Friend: సిగరెట్లు అడిగితే ఇవ్వలేదని స్నేహితుడిని చంపేశాడో వ్యక్తి. మహారాష్ట్రలోని థానె జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. డోంబివిలిలో జయేశ్ జాధవ్ (38) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. అనంతరం ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు. అయితే, ఇంటికి చేరుకుంటున్న సమయంలో జయేశ్ జాధవ్ ను అతడి స్నేహితుడు ఒకరు (32) కొన్ని సిగరెట్లు ఇవ్వాలని అడిగాడు.

అందుకు జయేశ్ జాధవ్ నిరాకరించాడు. దీంతో జయేశ్ పై నిందితుడు దాడి చేశాడు. జయేశ్ తలపై బలమైన గాయమైంది. జయేశ్ ఆ గాయంలోనే తన ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ జయేశ్ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనపై నిందితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. మొదట ప్రమాదవశాత్తూ చోటుచేసుకున్న మరణంగా కేసు నమోదుచేసుకన్నామని చెప్పారు. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చాక హత్యా నేరం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..