‘నీకు పాజిటివ్.. నాకు నెగెటివ్’.. రకుల్‌కు కరోనా పాజిటివ్‌పై మంచు లక్ష్మీ సెటైర్..

‘నీకు పాజిటివ్.. నాకు నెగెటివ్’.. రకుల్‌కు కరోనా పాజిటివ్‌పై మంచు లక్ష్మీ సెటైర్..

Updated On : December 23, 2020 / 1:18 PM IST

Rakul Preet – Manchu Lakshmi: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారినపడింది.. ‘‘పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను, ఫీలింగ్ బెటర్.. త్వరలో పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను.. షూటింగులో పాల్గొంటాను.. దయచేసి రీసెంట్‌గా నన్ను కలిసిన వారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను’’.. అని పోస్ట్ చేసింది రకుల్..

Rakul Preet - Manchu Lakshmi

అయితే రకుల్‌కు కరోనా సోకడంపై మంచు లక్ష్మీ సెటైరికల్‌గా స్పందించింది. ‘నీకు పాజిటివ్.. నాకు నెగెటివ్.. ఈ ఏడాది మోస్ట్ నెగెటివ్ పర్సన్ నేనే..’ అంటూ రకుల్ ట్వీట్‌కి ఫన్నీగా రిప్లై ఇచ్చింది మంచు లక్ష్మీ. రకుల్, మంచు లక్ష్మీ క్లోజ్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే..