IndiGo Flights: దేశ వ్యాప్తంగా ‘ఇండిగో’ విమానాల రాకపోకలు ఆలస్యం
క్రూ సిబ్బంది అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. శనివారం దాదాపు 45 శాతం ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాలు మాత్రమే సరైన సమయానికి రాకపోకలు కొనసాగించాయి. మిగతా ఇండిగో విమానాలు అన్నీ ఆలస్యంగా రాకపోకలు జరిపాయి.

Indigo New Flights Indigo To Introduce 20 New Flights On Various Routes From Mar 27
IndiGo Flights: దేశ వ్యాప్తంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాల రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయి. క్రూ సిబ్బంది అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. శనివారం దాదాపు 45 శాతం ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాలు మాత్రమే సరైన సమయానికి రాకపోకలు కొనసాగించాయి. మిగతా ఇండిగో విమానాలు అన్నీ ఆలస్యంగా రాకపోకలు జరిపాయి. ఇందుకు సంబంధించిన వివరాలు కేంద్ర విమానయాన శాఖ డేటాను పరిశీలిస్తే తెలిశాయి.
ఇండిగో విమానాల రాకపోకలు ఆలస్యం అవుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో విమానాలు ఆలస్యం కావడం పట్ల వివరణ ఇవ్వాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది. విమానాలు ఆలస్యం కావడాన్ని డీజీసీఏ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.