Medicinal Plant : ఔషధాల సిరి నేల ఉసిరి..వేర్లు నుంచి ఆకులు దాకా అన్నీ ఉపయోగాలే..
ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు,పువ్వులు, కాయలు, ఆఖరికి మొక్కల వేర్లు మనిషికి ఎంతో ఉపయోగపడేవే. అటువంటివాటిలో ఔషధాల సిరి నేల ఉసిరి వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలిస్తే ఈ మొక్కను పెరిటిలో పెంచుకోకమానరు. నేల ఉసిరి మొక్క ఒక ఔషధాల గని, నేల ఉసిరి వేర్లు నుంచి ఆకులు దాకా అన్నీ ఉపయోగాలే..

Medicinal Plant Nela Usiri
Nela Usiri Benefits : ప్రకృతి పుట్టాకే మనిషి పుట్టాడంటారు. పచ్చని ఈ ప్రకతిలో ఎన్నో వనరులను ఉపయోగించుకోవటానికే భగవంతుడు మనిషిని పుట్టించాడంటారు. అందుకే ప్రకృతికి మనిషికి ఎంతో అవినావభావం సంబంధం ఉంది.మన పెరట్లో పెరిగే ఎన్నో రకాల మొక్కలు మనకు ఎంతో ఉపయోగకరమైనవే. మన చుట్టూ పెరిగే ఎన్నో మొక్కలు మనకు దివ్య ఔషధాలే. కానీ వాటిని మనం గుర్తించలేం. గుర్తించినా నిర్లక్ష్యం చేస్తున్నామనేది నిజం.మన చుట్టూ పెరిగే చిన్న మొక్కల్ని పీకి పారేస్తూంటాం. ఉత్తరేణి, గరిక,అశ్వగంథ, గుంటగలగర ఆకు, సరస్వతి ఆకు ఇలా ఎన్నో ఔషధ మొక్కల్ని పీపి పారేస్తుంటాం. అటువంటిదే ‘నేల ఉసిరి’ కూడా. చిన్న చిన్న ఆకులుంటే ఈ మొక్క ఎన్నో రుగ్మతలకి, వ్యాధులకీ ఉపయోగపడుతోంది. ఆయుర్వేదంలో నేల ఉసిరికి చాలా విశిష్ట స్థానముంది. నేల ఉసిరి కాండం, వేర్లు, ఆకులు, పువ్వులు, కాయలు, ఈ మొక్కను గిల్లితే కారే పాలు అన్నీ ఆయుర్వేద మందుల్లో వాడతారు.
నేల ఉసిరి ఉపయోగాలు..
నేల ఉసిరిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వంటి అనేక ఔషధ లక్షణాలు చాలా ఉన్నాయి. నేల ఉసిరిని జ్యుస్ గా తీసుకుంటే పొత్తి కడుపులో మంట తగ్గిపోతుంది. ల్యూకోరోయా, బాధాకరమైన మూత్రవిసర్జనను , మూత్ర ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది. దీనిని శరీరంలో దురద, గాయాలు, గజ్జి, రింగ్వార్మ్స్ చికిత్సలో కూడా నేల ఉసిరిని ఉపయోగిస్తున్నారు.కాలేయం నుండి పిత్త ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. శరీరంలో ఎసిడిటీ, ఆమ్లత్వం నుండి ఉపశమనం పొందడానికి నేల ఉసిరి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. కాలేయ పనితీరును చురుకుగా చేస్తుంది.
నేల ఉసిరి జ్యూస్ కిడ్నీ స్టోన్స్ తో పాటు ఇతర కిడ్నీ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.కామెర్లు, హెపటైటిస్,కాలేయ ఆరోగ్యానికి నేల ఉసిరి దివ్య ఔషధమేనని చెప్పాలి.కాలేయం సమస్యలు వల్ల ఏర్పడే కంటి సమస్యలకు చికిత్స చేయడానికి నేల ఉసిరి రసం మంచిది. ఈ రసాన్ని ఉదయం ఒకసారి ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో సేవిస్తే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.మధుమేహానికి (డయాబెటిస్) ఈ జ్యూస్ చాలా మంచిది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, నేల ఉసిరి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది.
కామెర్లు ఉన్నవారు ఈ మొక్క వేర్లను తెచ్చుకుని రోట్లో వేసి మొత్తగా నూరగా వచ్చిన రసాన్ని పెరుగులో కలుపుకుని ఉదయం సాయంత్రం తాగితే కామెర్లు వెంటన తగ్గిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.గజ్జి తామర వంటి చర్మ వ్యాధులకు నేల ఉసిరి మంచి మందు. ఈ మొక్కను రోట్లో వేసి మొత్తంగా దంచి ఒక మద్దలా చేసి ఉప్పుతో కలిపి గజ్జి గానీ,తామర గానీ ఉన్న చోట ఉంచితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.ఆకలి లేనివారు నేల ఉసిరి మొక్క ఆకుల్ని ఉదయం సాయంత్రం నమిలితే చక్కటి ఆకలి వేస్తుంది. అలాగే పశువులకు కూడా నేల ఉసిరి చాలా ఉపయోగపడుతుంది. పశువులకు కళ్లల్లోంచి నీరు కారే సమస్య ఉంటే ఉసిరి ఆకుల్ని జ్యూస్ లా తయారు చేసి వాటిని కళ్లలో వేస్తే నీరు కారటం తగ్గుతుందట.
కాగా నేల ఉసిరి మొక్కను వార్షిక మొక్క అని అంటారు. ఎందుకంటే దీని జీవిత కాలం ఒక్క సంవత్సరమే నట. దీనినే భూమి ఆమ్లక మొక్క అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం Phyllanthus amarus. ఈ మొక్కను బహుఫల అని బముపత్ర మొక్క అని కూడా అంటారు.ఎందుకంటే ఈ మొక్కకు చింతాకుల్లా ఎన్నో ఆకులుంటాయి చిన్న చిన్నవి. అలాగే ఆకుల వెనకాలు చిన్న చిన్న కాయలుంటాయి.దీనికి ఇంకో పేరు స్టోన్ బ్రేకర్. ఎందుకంటే ఈ మొక్కలు ఎముకలు విరిగినప్పుడు ఉపయోగిస్తారు. ఇలా నేల ఉసిరికి ఎన్నో పేర్లు ఉన్నట్లే దీని వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి.