Ram Charan Fans : ‘మెగా’భిమానం.. నాలుగు రోజులు కాలినడక..!
తన మీద ఎంతో అభిమానంతో కలవడానికి వచ్చిన అభిమానులతో కాసేపు ముచ్చటించారు చరణ్..

Mega Power Star Ram Charan Met His Ardent Fans
Ram Charan Fans: ఆన్ స్క్రీన్ హీరోయిజం చూపించే హీరోలకు వీరాభిమానులుంటారు. ఆ అభిమానానికి మించి మరికొంతమంది భక్తులుగా మారిపోతుంటారు. మెగాస్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా తక్కుత టైంలోనే తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్..
Ram Charan : మెగా అభిమానులను అభినందించిన రామ్ చరణ్..
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో బాధితులను ఆదుకోవడానికి, అవసరమైన వారికి సాయం చెయ్యడానికి చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్, మెగాభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో అహర్నిశలూ శ్రమిస్తూ.. ఆపదలో ఉన్నవారికి సాయమందిస్తున్న అభిమానులను ఇటీవల అభినందించారు రామ్ చరణ్..
తన మీద ఎంతో అభిమానంతో తనను కలవడానికి వచ్చిన అభిమానులతో కాసేపు ముచ్చటించారు చరణ్. సంధ్య రాజ్, రవి, వీరేష్ ముగ్గురు రామ్ చరణ్‌కు డైహార్డ్ ఫ్యాన్స్.. తమ అభిమాన నటుణ్ణి కలవాలని, ఫొటో తీసుకోవాలని జోగులాంబ గద్వాల్ నుండి హైదరాబాద్‌కు.. 231 కిలోమీటర్లు, నాలుగు రోజుల పాటు కాలినడకన హైదరాబాద్ చేరుకున్నారు.
Ram Charan Fan : అభిమాన హీరోని కలిసిన ఆనందంలో భావోద్వేగానికి గురైన రామ్ చరణ్ ఫ్యాన్..
ఎట్టకేలకు చెర్రీని కలిశారు. తన అభిమానులను ఆప్యాయంగా పలకరించి, తన పైన వారు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా ఆలింగనం చేసుకున్నారు చరణ్.. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. తండ్రి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ లో సిద్ధ అనే కీలకపాత్రలో కనిపించనున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.