Milkha Singh : మిల్కా సింగ్‌కు మెగాస్టార్ నివాళి..

పరుగుల వీరుడు మిల్కా సింగ్ మరణం బాధాకరం - మెగాస్టార్ చిరంజీవి..

Milkha Singh : మిల్కా సింగ్‌కు మెగాస్టార్ నివాళి..

Chiranjeevi Milkasingh

Updated On : June 19, 2021 / 7:59 PM IST

Milkha Singh: ప్రముఖ అథ్లెట్, దిగ్గజ క్రీడాకారుడు, స్ప్రింటర్ మిల్కా సింగ్ (91) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ మిల్కా తుదిశ్వాస విడిచారు. ‘ఫ్లయింగ్ సిఖ్‌’ గా పిలవబడే మిల్కా సింగ్ మరణవార్త తెలుసుకున్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

Milkha Singh : మిల్కా సింగ్ మృతికి సెలబ్రిటీల సంతాపం..

టాలీవుడ్ సీనియర్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సూపర్‌స్టార్ మహేష్ బాబు, బిగ్ బి అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రాతో సహా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. మిల్కా సింగ్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు.

‘‘పరుగుల వీరుడు మిల్కా సింగ్ మరణం బాధాకరం. తన అద్భుతమైన ప్రతిభతో దేశ ప్రతిష్టను, భారత పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన భరతమాత ముద్దబిడ్డ మిల్కా సింగ్. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన కొన్ని తరాలకు స్ఫూర్తి ప్రదాత. మిల్కా సింగ్‌కు నివాళి’’ అంటూ చిరు ట్వీట్ చేశారు..