China: చైనాకు అమెరికా, బ్రిటన్ వార్నింగ్
చైనా గూఢచర్యం, డేటా చౌర్యం గురించి అమెరికా, బ్రిటన్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే, ఇరు దేశాలు చైనాకు వార్నింగ్ ఇచ్చాయి. లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో యూకే భద్రతా సంస్థ ఎం15 డైరెక్టర్ జనరల్ కెన్ మెకల్లమ్, అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే మాట్లాడారు. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Us Uk
China: చైనా గూఢచర్యం, డేటా చౌర్యం గురించి అమెరికా, బ్రిటన్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే, ఇరు దేశాలు చైనాకు వార్నింగ్ ఇచ్చాయి. లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో యూకే భద్రతా సంస్థ ఎం15 డైరెక్టర్ జనరల్ కెన్ మెకల్లమ్, అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే మాట్లాడారు. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా, యూకేలో చైనా గూఢచర్య కార్యకలాపాల ముప్పు భారీగా పెరిగిపోందని చెప్పారు.
Maharashtra: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఇంటి వద్ద భారీగా నిలిచిన వర్షపు నీరు
తమ దేశంలో చైనా ఆపరేషన్‌లపై నిఘా పెంచామని ఎం15 డైరెక్టర్ జనరల్ కెన్ మెకల్లమ్ చెప్పారు. 2018తో పోల్చితే ఇప్పుడు చైనా ఆపరేషన్‌లపై తాము ఇప్పుడు ఏడురెట్లు నిఘా పెంచినట్లు వివరించారు. తమ దేశ రహస్య సమాచారాన్ని చోరీ చేసే ఆపరేషన్‌ను చైనా చాలా ఓపికతో నిర్వహిస్తోందని అన్నారు. అలాగే, రష్యా, ఇరాన్ రహస్య ఆపరేషన్లపై కూడా దృష్టి సారించామని చెప్పారు. ప్రస్తుతం యూకే ప్రయోజనాలకు విరుద్ధమైన కార్యకలాపాలు తమ దేశంలో జరుగుతున్నాయని తెలిపారు. చైనా నుంచి ముప్పు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోందని అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే చెప్పారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఆధిపత్యం కోసం చైనా ఆయా రంగాలకు చెందిన సమాచారాన్ని చోరీ చేస్తోందని తెలిపారు.
COVID: దేశంలో భారీగా పెరిగిన రోజువారీ కరోనా కేసులు
అమెరికా, యూకేతో పాటు తమ మిత్రదేశాల ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రతకు చైనా ముప్పుగా పరిణమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, తైవాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి చైనా పాల్పడుతున్న చర్యలు కూడా ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ముప్పు ఉందని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అమెరికా, బ్రిటన్ చెప్పాయి. అమెరికా, యూకేలోని ప్రజాస్వామ్యం, మీడియా, న్యాయవ్యవస్థలపై చైనా ఆసక్తి కనబర్చుతోందని తెలిపాయి. అయితే, ఈ ఆసక్తి వాటిని చైనాలో అనుకరించడానికి కాదని, సొంత ప్రయోజనాలను వాటిని వాడుకోవాలనుకుంటోందని చెప్పాయి. ఇటువంటి చర్యలను మానుకోకపోతే అందుకు తగ్గ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చాయి. అయితే, అమెరికా, బ్రిటన్ చేసిన వ్యాఖ్యలను చైనా ఎప్పటిలాగే కొట్టిపారేసింది.