Minister KTR: కేసీఆర్‌పై కవితలతో ‘కట్ల పూలదడి’ పుస్తకం.. ఆవిష్కరించిన కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై 'కట్ల పూలదడి' పేరుతో కవియిత్రి తుమ్మల కల్పనా రెడ్డి రాసిన కవితా సంకలనాన్ని ఇవాళ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ప్రజల జీవితాన్ని సప్తవర్ణ శోభితం చేస్తున్న కేసీఆర్ పై మంచి కవితలు రాశారని ఈ సందర్భంగా తుమ్మల కల్పనా రెడ్డిని కేటీఆర్ ప్రశంసించారు. తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకుంటున్న ప్రస్థానానికి అద్దం పట్టే కవితలు ఈ సంపుటిలో ఉన్నాయని అన్నారు.

Minister KTR: కేసీఆర్‌పై కవితలతో ‘కట్ల పూలదడి’ పుస్తకం.. ఆవిష్కరించిన కేటీఆర్

Minister KTR

Updated On : November 30, 2022 / 9:38 PM IST

Minister KTR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ‘కట్ల పూలదడి’ పేరుతో కవియిత్రి తుమ్మల కల్పనా రెడ్డి రాసిన కవితా సంకలనాన్ని ఇవాళ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ప్రజల జీవితాన్ని సప్తవర్ణ శోభితం చేస్తున్న కేసీఆర్ పై మంచి కవితలు రాశారని ఈ సందర్భంగా తుమ్మల కల్పనా రెడ్డిని కేటీఆర్ ప్రశంసించారు. తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకుంటున్న ప్రస్థానానికి అద్దం పట్టే కవితలు ఈ సంపుటిలో ఉన్నాయని అన్నారు.

తెలంగాణ నుడికారపు సొంపు, ప్రతి కవితలోను ప్రతిబింబిస్తోందని కేటీఆర్ చెప్పారు. అలాగే, సమాజంలో స్త్రీ, పురుష సంబంధాల్లోని అసమానతలను పదునుగా ప్రశ్నించే కవితలు కూడా ఉన్నారని అన్నారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ కవి, గాయకుడు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. తన కవితా సంకలనాన్ని ఆవిష్కరించిన కేటీఆర్ కి కల్పనా రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Delhi liquor scam: ‘ఢిల్లీ లిక్కర్ స్కాం’ రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట పేర్లు