Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక జరుగుతోన్న వేళ సీఈవో వికాస్ రాజ్‌కు బండి సంజయ్ ఫోన్ కాల్

తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక జరుగుతోన్న వేళ సీఈవో వికాస్ రాజ్‌కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ చేసి మాట్లాడారు. మునుగోడులో అధికార టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు చేశారు. మునుగోడులో ఓటర్లను టీఆర్ఎస్ నేతలు ప్రలోభపెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. బయటి వ్యక్తులను పోలింగ్‌ కేంద్రాల నుంచి పంపించి వేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ చెప్పినట్లు తెలిసింది.

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక జరుగుతోన్న వేళ సీఈవో వికాస్ రాజ్‌కు బండి సంజయ్ ఫోన్ కాల్

bandi sunjay

Updated On : November 3, 2022 / 1:23 PM IST

Munugode Bypoll: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక జరుగుతోన్న వేళ సీఈవో వికాస్ రాజ్‌కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ చేసి మాట్లాడారు. మునుగోడులో అధికార టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు చేశారు. మునుగోడులో ఓటర్లను టీఆర్ఎస్ నేతలు ప్రలోభపెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.

బయటి వ్యక్తులను పోలింగ్‌ కేంద్రాల నుంచి పంపించి వేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ చెప్పినట్లు తెలిసింది. మరోవైపు ఉపఎన్నిక పోలింగ్ జరుగుతున్న తీరుపై బండి సంజయ్ హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో పలువురు నేతలతో సమావేశమయ్యారు. పోలింగ్ ఎలా కొనసాగుతోంది? అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? వంటి విషయాలపై ఆయన పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మునుగోడులోని బీజేపీ నేతలకు ఫోను చేసి ప్రదింపులు జరిపారు. కాగా, పోలింగ్ రోజు కూడా ప్రధాన పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. పోలింగ్ సరళిని టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు పరిశీలిస్తున్నారు. ఓట్లు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీసి కనపడుతున్నారు. ఈసీ కూడా వెబ్ క్యాస్టింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తోంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..