‘నారప్ప’ లో నా ప్రమేయం లేకుండానే చాలా జరుగుతున్నాయి.. మణిశర్మ సెన్సేషనల్ కామెంట్స్..

Narappa: ‘ఎఫ్’, ‘వెంకీమామ’ వంటి వరుస హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘నారప్ప’.. ప్రియమణి వెంకీ భార్యగా కనిపిస్తోంది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి. మరియు వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్, గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
తాజాగా ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న మెలోడి బ్రహ్మ మణిశర్మ ‘నారప్ప’ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నారప్ప’ కి నన్ను పనిచేయనిస్తే బాగుండేది.. కానీ పని చేయనివ్వట్లేదు.. ఆల్ రెడీ మొన్న ఏదో టీజర్ రిలీజ్ చేసి అందులో ఒరిజినల్ మ్యూజిక్ వేశారు.. అదో పెద్ద కాంట్రవర్సీ అయ్యింది, నేను కాపీ కొట్టాను అన్నారు.. నా ఇన్‌వాల్వ్‌మెంట్ లేకుండా జరుగుతోంది..’’ అంటూ మణిశర్మ విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ కానున్న ‘నారప్ప’ కి సినిమాటోగ్రఫీ: శ్యామ్.కె నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: గాంధీ నడికుడికర్, కథ: వెట్రి మారన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, విజయ్, పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంత శ్రీరామ్, కృష్ణ కాంత్, కాసర్ల శ్యాం..