AIMIM in UP : ‘ఓవైసీ సాబ్ ప్రధాని కావాలంటే..ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి’..కుటుంబ నియంత్రణ చేయించుకోకూడదు
'ఓవైసీ సాబ్ ప్రధాని కావాలంటే..ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి’ అని ఏఐఎంఐఎంకి చెందిన అలీగఢ్ జిల్లా అధ్యక్షుడు గుఫ్రాన్ నూర్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి.

Aimim In Up
Muslims should produce more children to make owaisi pm : ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల వేడి హీటెక్కుతోంది. అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారం కోసం..ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో అధికారం కోసం ఎత్తులకు పై ఎత్తులతో వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాయి.యూపీ ఎన్నికల్లో మరో విశేషమేమంటే..తెలంగాణకు చెందిన ఎంఐఎం పార్టీ కూడా యూపీలో పాగా వేయాలనుకుంటోంది. దీంట్లో భాగంగా ఎంఐఎం పార్టీ యూపీలో సమావేశాలతో బిజీ బిజీగా ఉంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ యూపీలో పాగా వేసే యత్నంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. యూపీలో ఉన్న ముస్లింలను ఆకట్టుకునేందుకు సమావేశాల్లో స్పీచ్ లిస్తున్నారు.
Read more : ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేలా మా పిల్లలకు కూడా నేర్పిస్తాం
ఈ క్రమంలో ఏఐఎంఐఎం పార్టీకి చెందిన ఓ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘అసదుద్దీన్ ఓవైసీని ప్రధాని కావాలి..అలా ఆయన ప్రధాని కావాలంటే ముస్లింలు అందరు ఎక్కువమంది పిల్లలను కనాలి” అని సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏఐఎంఐఎంకి చెందిన అలీగఢ్ జిల్లా అధ్యక్షుడు గుఫ్రాన్ నూర్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
“ముస్లింలు రాజ్యాధికారం పొందాలి. అలా అధికారం దక్కాలంటే ముస్లింలు అంతా పిల్లల్ని ఎక్కువమందిని కనాలి. మనం సామాజిక వర్గం వారు పిల్లలు లేకపోతే మనం రాజ్యాధికారం ఎలా సాధిస్తాం? ఓవైసీ సాబ్ ఎలా ప్రధాని అవుతారు? శైకత్ సాబ్ ఎలా ముఖ్యమంత్రి అవుతారు? కాబట్టి ఒవైసీ ప్రధాని కావాలంటే పిల్లల్ని ఎక్కువమందిని కనండి” అంటూ ముస్లింలకు సలహా ఇచ్చారు.
Read more : Asaduddin Owaisi : యూపీలో అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు!
‘దళితులు, ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కనకూడదని కట్టడి చేస్తున్నారు.ముస్లింలు కుటుంబ నియంత్రణ చేయించుకోకూడదు. అలా చేయటం షరియత్ చట్టానికి వ్యతిరేకం’ అని తెలిపారు.