Asaduddin Owaisi : యూపీలో అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు!

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మత సామరస్యానికి భంగం కలిగించేలా మాట్లాడినందుకు, ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదు అయింది.

Asaduddin Owaisi : యూపీలో అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు!

Owaisi Booked In Up For ‘vitiating’ Communal Harmony, Violating Covid Norms

Updated On : September 10, 2021 / 7:40 PM IST

Asaduddin Owaisi booked in UP : ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మత సామరస్యానికి భంగం కలిగించేలా మాట్లాడినందుకు, ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. యూపీలోని బారాబంకిలో గురువారం అసదుద్దీన్ ఓ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి పెద్ద ఎత్తున జనాలు తరలిరాగా.. అసదుద్దీన్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు తెలిపారు. సభలో కోవిడ్ ప్రోటోకాల్ పాటించలేదని, మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లపై అసదుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా ఆరోపణులు వచ్చాయి. దాంతో శుక్రవారం బారాబంకి పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.
Murder Case : శ్రీరంగాపురం హత్య కేసులో నిందితుడు అరెస్ట్

బారాబంకి పోలీసు సూపరింటెండెంట్, యమునా ప్రసాద్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 9న పోలీస్ స్టేషన్ పరిధిలో మొహల్లా కాట్ర చందనలో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ (AIMIM) జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టు ఆయన తెలిపారు. మాస్క్ లేకుండా, సామాజిక దూరాన్ని పాటించలేదని చెప్పారు. అలాగే తన ప్రసంగంలో అసదుద్దీన్ మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అసదుద్దీన్ ఒవైసీ మూడు రోజుల నుంచి యూపీ పర్యటనలో ఉన్నారు. అయోధ్యలోని రుడౌలి నుంచి బహిరంగ సభ నిర్వహించారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎంఐఎం ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు. సుల్తాన్‌పూర్‌లో, బారాబంకిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ పార్టీ 100 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది.
Red Ant Chutney : కరోనాకు నివారణగా ఎర్రచీమల చట్నీ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు