Tuck Jagadish : ఓటీటీలో కాదు.. ‘టక్ జగదీష్’ థియేటర్లోనే కలుస్తాడు..
‘టక్ జగదీష్’ చిత్రం ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని చిత్రయూనిట్ తెలిపింది..

Nani Tuck Jagadish Movie Will Release In Theatres Only
Tuck Jagadish: ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఫ్యామిలి ఎంటర్‌టైనర్ ‘టక్ జగదీష్’. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం విడుదల తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే ‘టక్ జగదీష్’ చిత్రం ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని చిత్రయూనిట్ తెలిపింది.
‘‘టక్ జగదీష్’ చిత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల కానుందనే వార్తలు పూర్తిగా అవాస్తవం. పుకార్లను నమ్మవద్దు. టక్ జగదీష్ పూర్తిగా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం రూపొందించబడిన మంచి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత ‘టక్ జగదీష్’ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటనను వెల్లడిస్తాం. దయచేసి అందరు జాగ్రత్తగా ఉండండి. కోవిడ్ జాగ్రత్తలను పాటించండి’’ అని మూవీ టీమ్ తెలిపారు..
తారాగణం..
నేచురల్ స్టార్ నాని, రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్, నాజర్, జగపతి బాబు, రావు రమేష్, నరేష్, డానియల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవదర్శిని, ప్రవీణ్..
సాంకేతిక బృందం..
రచన – దర్శకత్వం : శివ నిర్వాణ
నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది
సంగీతం : ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
ఆర్ట్ : సాహి సురేష్
ఫైట్స్ : వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్. వెంకటరత్నం (వెంకట్)
కో– డైరెక్టర్ : లక్ష్మణ్ ముసులూరి..