పండగకి వచ్చే సినిమాలు కొన్ని.. పండగలాంటి సినిమాలు కొన్ని..

పండగకి వచ్చే సినిమాలు కొన్ని.. పండగలాంటి సినిమాలు కొన్ని..

Updated On : February 23, 2021 / 5:59 PM IST

Tuck Jagadish Teaser: నేచురల్ స్టార్ నాని, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా.. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సున్నితమైన ప్రేమకథల్ని తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న చిత్రం ‘టక్ జగదీష్’..

ఫిబ్రవరి 24 నాని జన్మదినోత్సవం సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్‌గా ఈ చిత్రం రూపొందుతున్నట్లు అర్థమవుతోంది. నాని మేకోవర్, బాడీ లాంగ్వేజ్ బాగుంది. టీజర్ అంతా కూడా బ్యాగ్రౌండ్ సాంగ్ వినిపిస్తుండగా కొనసాగుతుంది.

నాజర్, జగపతిబాబు, నరేష్, రావు రమేష్, రోహిణి, డానియేల్ బాలాజీ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 2021 ఏప్రిల్ 23న ‘టక్ జగదీష్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రానున్నాడు. ఈ మూవీకి సంగీతం : థమన్, కెమెరా : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి.