Nara Lokesh: చంద్రబాబు రాముడైతే.. జగన్ రాక్షసుడు: నారా లోకేష్

మహానాడు వేదికగా వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాముడైతే.. జగన్ రాక్షసుడు అన్నారు. వైఎస్సార్సీపీ అంటే యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ అని కొత్త అర్థం చెప్పారు.

Nara Lokesh: చంద్రబాబు రాముడైతే.. జగన్ రాక్షసుడు: నారా లోకేష్

Nara Lokesh

Updated On : May 28, 2022 / 7:43 PM IST

Nara Lokesh: మహానాడు వేదికగా వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాముడైతే.. జగన్ రాక్షసుడు అన్నారు. వైఎస్సార్సీపీ అంటే యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ అని కొత్త అర్థం చెప్పారు. మహానాడు రెండో రోజు జరిగిన సభలో శనివారం నారా లోకేష్ మాట్లాడారు.

Rajasthan: అక్కచెల్లెళ్లు సహా ఐదుగురి అనుమానాస్పద మృతి

‘‘టీడీపీ పునాదులు గట్టిగా ఉన్నాయి. పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరు. టీడీపీని ఏదో చేద్దామనుకున్నవాళ్లు గాల్లో కొట్టుకుపోయారు. టీడీపీ కార్యకర్తల శరీరం కోస్తే పసుపు రక్తం వస్తుంది. మా నేతల్ని చంపేముందు జై జగన్ అనమన్నా… జై తెలుగుదేశం అనే కార్యకర్తలున్న పార్టీ టీడీపీ. శవాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయం చేసే పార్టీ వైసీపీ’’ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. నారా లోకేష్‌కు గొంతు సహకరించకపోవడంతో ప్రసంగాన్ని మధ్యలో ఆపేశారు. అయితే, ఆయన చెప్పిన మాటలను తాను చెబుతానని పయ్యావుల కేశవ్ ప్రసంగించారు. మరోవైపు సభ జరుగుతుండగా కొంత ఆటంకం కలిగింది. బహిరంగ సభలో కార్యకర్తలు అదుపుతప్పడంతో చంద్రబాబు వాళ్లను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.

Bike Stunt: బైకుపై శక్తిమాన్ స్టంట్లు.. యువకుడి అరెస్టు

క్రమశిక్షణ లేకుంటే ఇబ్బంది పడతామని, సభకు అంతరాయం కలుగుతుందన్నారు. దీంతో కార్యకర్తలు తిరిగి మామూలు స్థితికి వచ్చారు. మరోవైపు స్టేజిమీద కూడా గందరగోళం నెలకొనడంతో నేతలను కూడా చంద్రబాబు కంట్రోల్ చేశారు. బాధ్యతతో ఉండాలని సూచించారు.