Negative : ఇంట్రెస్టింగ్గా సైకలాజికల్ థ్రిల్లర్ ‘నెగెటివ్’ ట్రైలర్..
కొత్తదనం కలిగిన యూనివర్సల్ కాన్సెప్ట్‌తో ప్రస్తుత జనరేషన్ యూత్‌కి కనెక్ట్ అయ్యేలా బాల సతీష్ దర్శకత్వంలో ‘నెగెటివ్’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది..

Negative
Negative: కంటెంట్‌లో కొత్తదనం ఉంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా చూడకుండా ఆదరిస్తుంటారు మన తెలుగు ప్రేక్షకులు.. అలాంటి కొత్తదనం కలిగిన యూనివర్సల్ కాన్సెప్ట్‌తో ప్రస్తుత జనరేషన్ యూత్‌కి కనెక్ట్ అయ్యేలా బాల సతీష్ దర్శకత్వంలో ‘నెగెటివ్’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది.
విక్రమ్ శివ, శ్వేత వర్మ హీరో హీరోయిన్లుగా నటించగా, డైరెక్టర్ కమ్ యాక్టర్ దయానంద్ రెడ్డి ఇంపార్టెంట్ రోల్లో కనిపించనున్నారు. ఫిలోమినా ఇన్ఫోటైన్మెంట్స్ బ్యానర్ మీద ఎఎమ్. రాజేష్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.. ఆదివారం ‘నెగెటివ్’ ట్రైలర్ రిలీజ్ చేశారు.
కాన్సెప్ట్ ఏంటనేది హింట్ ఇస్తూనే, మూవీపై ఇంట్రెస్ట్ కలిగించిందీ ట్రైలర్.. విక్రమ్ శివ, శ్వేత వర్మ పెర్ఫార్మెన్స్, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘నెగెటివ్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.. సంగీతం : విజయ్ కురాకుల, కెమెరా : నాని చమిడిశెట్టి, ఎడిటింగ్ : జెస్విన్ ప్రభు, కో- ప్రోడ్యూసర్ : జి.వి. సునీల్ కుమార్..